ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ వీటి మార్కెట్స్, మాసరాటి ఎంఎస్జీ రేసింగ్తో తమ భాగస్వామ్యాన్ని సీజన్ 11లోనూ కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సీజన్ డిసెంబర్ 7, 2024న సావో పాలోలో ప్రారంభం కానుందని తెలిపింది. సీజన్ 10 తర్వాత అత్యుత్తమ విజయాల కోసం మాసరాటి ఎంఎస్జీ రేసింగ్తో కలిసి నడుస్తుందని వెల్లడించింది. ఈ సందర్భంగా గ్లోబల్ బ్రాండ్, పీఆర్ లీడ్ డాండెలిన్ కోహ్ మాట్లాడుతూ, సీజన్ 11లో మాసరాటి ఎంఎస్జీ రేసింగ్తో మా భాగస్వామ్యం కీలక ఘట్టాన్ని సూచిస్తుందని తెలిపారు. అత్యంత విజయవంతమైన సీజన్ 10 తర్వాత ముందుకు వెళ్లేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నామన్నారు. ఈ భాగస్వామ్యం మమ్మల్ని ట్రాక్ పైన మాత్రమే కాకుండా, ఆర్థికంగా ఎక్కడికి తీసుకెళ్తుందో చూడటానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. అనంతరం మాసరాటి ఎంఎస్జీ రేసింగ్ టీమ్ ప్రిన్సిపల్ సిరిల్ బ్లైస్ మాట్లాడుతూ, వీటీ మార్కెట్స్ సీజన్ 11లోనూ మా భాగస్వామ్యం ముందుకు సాగడం సంతోషంగా ఉందన్నారు. మా భాగస్వాములు మా ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మా లక్ష్యాన్ని పంచుకునే, నమ్మే భాగస్వాములను ఆకర్షించడం మా విజయానికి అవసరమన్నారు. ఆర్థిక ప్రపంచం నుంచి వచ్చిన వీటీ మార్కెట్స్ ఫార్ములా ఈలో మా అద్భుతమైన పనితీరు కోసం నిరంతరం చేసే ప్రయత్నాలను బాగా అర్థం చేసుకుంటుందని తెలిపారు.