Wednesday, August 27, 2025
spot_img

మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు

Must Read

పిల్లల చదువును తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఏపీ విద్యాశాఖ నిర్వహిస్తుంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‎తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, విద్యార్థులు స్మార్ట్‎ఫోన్‎లకు బానిసలుగా మారకుండా తల్లిదండ్రులు జాగ్రత పడాలని అన్నారు. డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాల స్థాయి నుండే అమలు కావాలని తెలిపారు.

Latest News

ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక

హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS