దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా శనివారం ముంబయి ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ రూంకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు కంట్రోల్ రూంకు మెసేజ్ రావడంతో ముంబయి పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రధానమైన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.