సినిమా ప్రభావం సమాజంపై చెప్పలేనంత..
భక్తినో, దేశభక్తినో, బంధాలు, యువతలో గొప్ప విలువలనో
పెంచాల్సిన బాధ్యతలు విస్మరించిన రీల్ హీరో సినిమాలకు కాలం చెల్లనుంది
అడవికి అంటుకున్న ఫైర్ లా సమాజంలోని విలువలను దహించివేస్తున్నాయి
స్మగ్లింగ్ చేసే దోపిడి దొంగదే రూలుగా చూపిస్తూ సామాజిక బాధ్యత విస్మరించినా పట్టించుకోని సెన్సార్ బోర్డ్!
ప్రభుత్వాలు ఇలాంటి సినిమాలకు టికెట్ల ధరలు భారీగా పెంచి ప్రభావంతమైన కళారంగాన్ని
ప్రేమించే వారి జేబుల లూటీకి పర్మిషన్ ఇవ్వడం దుర్మార్గమే?
ప్రజా ప్రయోజనాలు, విలువలు, చైతన్యం లేని సినిమాలకు ప్రయారిటీ భరత జాతికి పట్టెడు అన్నం
పెట్టే రియల్ హీరోలైన రైతులు ఆరుగాలం చెమటోడ్చీ పండించిన
పంటకు “గిట్టుబాటు ధర”లేదు గ్యారంటీ ఇది అవమాననీయం కాదా!..
- మేదాజీ