Monday, January 6, 2025
spot_img

పోలీసులను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారు

Must Read
  • బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటం శివ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకొని నిర్బంధ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటం శివ విమర్శించారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాటం శివ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ స‌ర్కార్ భ‌య‌ప‌డిపోతుంద‌ని అన్నారు. అక్ర‌మంగా బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుల‌ను అరెస్ట్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. ఇందిరమ్మ పాల‌న అంటేనె నిర్భంద పాల‌న అని, దీనిని కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి రుజువు చేసింద‌ని విమర్శించారు. తెలంగాణలోనే ప్ర‌జాస్వామ్యం ఖూనీ అవుతుంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌శ్నించే గొంతుల‌ను అణ‌చివేయాల‌నే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. తెలంగాణలో ఇలాగే నిర్బంధాలు కొనసాగితే, అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అశోక్ యాదవ్, రాంబాబు, మల్లేష్ ముదిరాజు, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

సంత‌లోకొస్తే.. క‌బేళాల‌కే..?

కొండమల్లేపల్లి సంతలోకి మూగజీవాలు అడుగు పెడితే గోవదకు సాగనంపడమే.. ఒకప్పుడు రైతుల కోసం సంత ప్రస్తుతానికి గోవద కోసం నడుస్తున్నా సంత సంత మాటున జరిగే అక్రమాలలో అందరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS