గుంటూరులోని మంగళగిరి ఎయిమ్స్ వైద్యకళాశాలలో ఈ నెల 17న జరిగే స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిమ్స్ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి అవసరమైన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, వీఐపీలు,అధికారులు, ప్రముఖుల వాహన పార్కింగ్ ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.