ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, బ్యాటింగ్ పరంగా పూర్తిగా నిరాశపరిచామని తెలిపాడు. “మాకు ఈ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‌లో మేము బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాయి. ఆస్ట్రేలియా మా కంటే మెరుగ్గా ఆడింది. గెలిచేందుకు వారు అన్ని రకలగా అర్హులే. ఈ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు మాకు కొన్ని అవకాశాలు లభించాయని రోహిత్ పేర్కొన్నాడు.