ఈవీఎంలపై ప్రజల్లో విశ్వాసం లేదని, మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యనించారు. ఆదివారం షోలాపూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అయిన పాల్గొని మాట్లాడుతూ, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇంగ్లాండ్, అమెరికా సహ ప్రపంచమంతా బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి..మన దేశంలో మాత్రమే ఈవీఎంలు ఎందుకు అని ప్రశ్నించారు.