Thursday, December 12, 2024
spot_img

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ బకాయిల చెల్లింపు ఎప్పుడు?

Must Read

ప్రపంచం నలుమూలల నుండి వాట్సాప్, ట్విట్టర్, ఈ మెయిల్ మొదలగు అంతర్జాల ప్రక్రియల ద్వారా నిమిషాల్లో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు. సాధారణ ప్రజానీకం కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులకు ఫోన్ పే. గూగుల్ పే ద్వారా నిమిషాల్లో డబ్బులు చెల్లించుచున్నారు. సింగరేణి యాజమాన్యం 2013 2014 ఆర్థిక సంవత్సరంలో 61,778 మంది కార్మికులతో 50.47 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లలో 170.29 మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టిని/ఓవర్ బర్డెన్ ను తొలగించింది. 2023 2024 ఆర్ధిక సంవత్సరంలో 41,837 మంది కార్మికులతో 70.02 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.

ఓసిపిలలో 420.29 మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించింది. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా సాంకేతి కతను అభివృద్ధి చేసుకుంటూ, కార్మికులపై పనిభారం మోపుతూ బొగ్గు ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచుకోవడానికి ఎనలేని శ్రద్దను చూపుతుంది. కాని కార్మికుల శ్రమ ఫలితాలను వర్తింపచేయడానికి ఏండ్ల తరంతం నిర్లక్ష్యం చేస్తుంది. భారతదేశ వ్యాప్తంగా బొగ్గు గనుల కార్మికులకు జెబిసిసిఐ (జాయింట్ బైపార్టీయేట్ కమిటీ ఫర్. ది కోల్ ఇండస్ట్రీ) సంప్రదింపుల ద్వారా ఎన్ సిడబ్ల్యూఎ (నేషనల్ కోల్ వేజు అగ్రిమెంట్) లతో వేతన ఒప్పందాలు అమలు అవు తాయి. కేంద్ర కార్మిక శాఖ, యాజమాన్య, జాతీయ కార్మిక సం ఘాల ప్రతినిధులు కలిసి సంప్రదిం పులతో సిఐఎల్ (కోల్ ఇండియా లిమిటెడ్), సింగరేణి కంపెనీ ఇంకా టిస్కో(టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ) లాంటి ప్రైవేటు కంపెనీల కార్మికులకు, ఉద్యోగులకు వేతన, భత్యాల చెల్లింపులను, పని కేటాయింపులను, పదోన్నతుల వర్తింపులను నిర్ణయించుతారు. అందులో భాగంగా 11వ, నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ 23 నెలలు ఆలస్యంగా 20 23 మే 20న ఒప్పందం అయింది. ఉద్యోగంలో కొనసాగు తున్న కార్మికులకు 2021 జులై నుండి 2023 మే వరకు 23 నెలల వేతన బకాయిలను అక్టోబర్లో చెల్లించారు.

కాని 2021 జులై నుండి 2023 మే 31 మధ్య కాలంలో రిటైర్డ్ అయిన, మెడికల్ ఆస్పిట్ అయిన కార్మికులకు, డెత్ కార్మికుల కుటుంబాలకు సిఎంపీఎస్(కోల్ మైన్స్ పెన్షన్ స్కీం) బకాయిలను చెల్లించడానికి చేతులు రావడం లేదు. కోల్ మైన్స్ పెన్షన్ స్కీం 1998 (సిఎంపిఎస్ 98) మార్గదర్శకాల ప్రకారంగా కార్మికుల సర్వీస్ కాలంలో ప్రతినెల వేతనం నుండి 7 శాతం మినహాయిం చిన డబ్బులను, యాజమాన్యం కూడా తమ వాటాగా 7 శాతం డబ్బు లను, ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తిపై రూ.20లను కలిపి బొగ్గు గని కార్మికుల భవిష్యత్ నిధిలో జమ చేస్తారు. కార్మికులు ఉద్యోగ విరమణను పొందిన చివరి పది నెలల నోషనల్ సాలరీని (మూల వేతనం, స్థిర కరువు భత్యం, మారేడు కరువు భత్యం) జమచేయగా వచ్చిన మొత్తం నుండి మరల ఒక నెల అవరేజ్ గా లెక్కించిన సాలరీపై 25 శాతాన్ని పెన్షన్ రూపకంగా చెల్లించుతారు. జీవిత కాలం ఎదుగు, బొదుగు లేని అదే పెన్షన్ ను చెల్లించుతారు. జీవిత భాగ స్వామికి (స్పాస్) భర్త పొందిన పెన్షన్ లో 60 శాతాన్ని వితంతు పెన్షన్ చెల్లిస్తారు. అయితే బొగ్గు గని కార్మికుల 11వ, వేతన ఒప్పందం 23 నెలలు ఆలస్యంగా జరిగింది. అందువలన తేది 01/07/2021 నుండి 31/05/2023 మధ్యకాలంలో రిటైర్డ్ అయిన, మెడికల్ ఆన్ పిట్ అయిన, చనిపోయిన కార్మికులకు 2021 జూన్ 30 వరకు అమలులో ఉన్న బొగ్గు గని కార్మికుల 10వ, వేతన ఒప్పందంలోని వేతన, భత్యాలకు అనుగుణంగా పెన్షన్ లెక్కించి చెల్లించారు. ఇప్పుడు సిఎంపిఎస్ 198 ప్రకారంగా నేషనల్ కోల్ వేజు అగ్రిమెంట్-11లో పెరిగిన వేతన భత్యాలకు అనుగుణంగా రివైజ్డ్ /పునరుద్ధరణ పెన్షన్ను లెక్కించి బకాయిల ను చెల్లించవలసి ఉన్నది.11వ, వేతన ఒప్పంద కాలపరిమితి 2026 జూన్ 30తో ముగుస్తుంది. అంటే 2021 జులై నుండి 2024 డిసెంబర్ 31 నాటికి రిటైర్డ్ అయిన కార్మికులకు 42 నెలల కోల్ మైన్స్ పెన్షన్ బకాయిలను చెల్లించవలసి ఉన్నది.

సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ బకాయిలను సిఎంపిఎఫ్ (కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్) రీజనల్ కమీషనర్స్ గోదావరిఖని, కొత్త గూడెం, సెంట్రల్ కమీషనర్ ధన్ బాద్ ద్వారా చెల్లించుతారు. సింగరేణి యాజమాన్యానికి అదనంగా ఎటువంటి ఆర్ధిక భారం ఏమి లేదు. కాకపోతే 2021 జులై నుండి 2023 మే 31వరకు గల 23 నెలల కాలంలో రిటైర్డ్, మెడికల్ ఆన్ పిట్, డెత్ కార్మి కులకు పునరుద్ధరణ కోల్ మైన్స్ చెల్లింపుకై సహజ్ ఫారం “ ద్వారా కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్, కోల్ మైన్స్ పెన్షన్ రిఫండ్ వివరాలతో కూడిన ప్రతి రిటైర్డ్ కార్మికునికి సంబంధించిన 10 నెలల నోషనల్ సాలరీని, ఒక నెల అపరేజీ సాలరీ వివరాల సమా చారాన్ని రామగుండం ఏరియాలోని 1,2,3 /మూడు డివిజన్లు, భూపాలపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, జెల్లంపల్లి డివిజన్ల కార్మికుల నోషనల్ సాలరీ సమాచారాన్ని గోదావరిఖని సిఎంపి ఎఫ్ కమీషనరు, అలాగే కొత్తగూడెం మైన్స్, కార్పొరేట్, ఇల్లందు, మణుగూరు డివిజన్ల కార్మికుల 10 నెలల నోషనల్ సాలరీని, ఒక నెల ఆవరేజ్ సాలరీ సమాచారాన్ని సిఎంపిఎఫ్ కమీషనర్ కొత్తగూడెంకు పంపించాలి.

సింగరేణి యాజమాన్యం పంపించిన సమా చారాన్ని మరల వాల్లు ఆడిట్ చేసి సెంట్రల్ రీజనల్ కమీషనర్ ధన్బాద్కు పంపిస్తారు. అప్పుడు కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో నగదు గా పెన్షన్ బకాయిలను జమ చేయడం జరుగుతుంది. సింగరేణి అధికారులు కార్మికులకు క్రమశిక్షణ రాహిత్య చర్యల పేర ఉద్దేశ్య పూర్వకంగా నత్తనడకగా పని చేశారని, సమయపాలన పాటిం చలేదని, అజాగ్రత్తగా పని చేశారని, అధికారులతో వాగ్వి వాదం చేశారని ఇలా చిన్న కారణాలను భూతద్దంలో చూపించి కార్మికు లకు లెటర్లు ఇవ్వడానికి శ్రద్ద చూపుచున్నారు. కాని చట్ట పరం గా, సకాలంలో కార్మికులకు బకాయిలను చెల్లించడానికి అధికార యంత్రాంగం ఇష్టానుసారంగా విధులను నిర్వహించు చున్నారు. మాపై ఎవరూ చర్యలు తీసుకోరానే ధీమాతో పర్సనల్ ఆఫీసర్లు, కాలరీ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లు కార్మికులకు ప్రయోజనమైన పనుల నిర్వహణలో, పర్య వేక్షణలో తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడుతున్నారు. సిఎంపిఎఫ్ రీజనల్ కమి షనర్స్, సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ విభా గ డైరెక్టర్ సమన్వయంతో సమీ క్షలు చేసి సత్వరంగా రిటైర్డ్, మెడికల్ అన్ పిట్ కార్మి కులకు, డెత్ కార్మికుల కుటుం బానికి 42 నెలల పునరుద్ధరణ కోల్మన్స్ బకాయిలను చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు.

-మేరుగు రాజయ్య,

9441440791

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS