గతకొన్ని రోజులుగా జరుగుతున్న కుటుంబ వివాదంపై సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏ ఇంట్లోనైనా సోదరుల మధ్య గొడవలు సహజమే..తమ ఇంట్లో కూడా అలాంటి విభేధాలే వచ్చాయని తెలిపారు. ఇంటి గొడవలను వారు అంతర్గతంగా పరిష్కరించుకుంటారని అన్నారు.
గతకొన్ని రోజులుగా మంచు కుటుంబంలో జరుగుతున్న వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని మంచు మనోజ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.