ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఇటీవల బెదిరింపు కాల్స్, సందేశాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేషీకి బెదిరింపు కాల్స్, సందేశాలు పంపించిన వ్యక్తిని విజయవాడ పోలీసులు గుర్తించారు. మల్లికార్జునరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి కాల్స్ వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎన్టీఆర్ జిల్లా తిరుపూరుకు చెందిన మల్లికార్జునరావుగా గుర్తించారు.