Wednesday, February 5, 2025
spot_img

సంత‌లోకొస్తే.. క‌బేళాల‌కే..?

Must Read
  • కొండమల్లేపల్లి సంతలోకి మూగజీవాలు అడుగు పెడితే గోవదకు సాగనంపడమే..
  • ఒకప్పుడు రైతుల కోసం సంత ప్రస్తుతానికి గోవద కోసం నడుస్తున్నా సంత
  • సంత మాటున జరిగే అక్రమాలలో అందరు భాగస్వాములే
  • చూసిచునట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం
  • మూగజీవాలను గోవదకు తరలించకుండ కాపాడాలని కోరుతున్న జంతువు ప్రేమికులు

దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం పరిధిలో గత కొన్ని ఏండ్లుగా రైతుల కోసం ఏర్పాటు చేసి రైతులకు సాగు చేసేందుకు అవసరమైన ఎద్దులను ఆవులను కొనుగోలు చేసి లేదా మార్పిడి చేసుకొని వ్యవసాయానికి అనుకూలంగా జోడెద్దులను మార్చుకోవడం జరుగుతుంది.ఇలాంటి తరుణంలో మారుతున్న కార్యక్రమంలో రైతుల కోసం ఏర్పాటుచేసిన సంత కాస్త గోవధ కోసం ఏర్పాటు చేసే సంతగా మారి కాంట్రాక్టర్లకు నికర లాభాలను తెచ్చే సంతగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదని రైతు సంఘాల నాయకులు తీవ్రంగా విమర్శించడం జరిగింది.గోవకు పాల్పడుతున్న వ్యక్తుల అక్రమాలు రోజురోజుకు పెరిగిపోయాయి అనడంలో ప్రత్యేక సాక్ష్యలు మినీ వాహనంలో లేక దూడలను సుమారు 10నుండి 15ఒకదానిపై మరొకటి కుక్కి హైదరాబాదు పాత బస్తి,ముఖ్యంగా శంషాబాద్ తీర ప్రాంతంలోకి తరలించడం జరుగుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే:– కొండమల్లేపల్లి మండలం పరిధిలో ఆదివారం సంత నిర్వహిస్తున్న తరుణంలో తేదీ29/12/2024 నాడు సాయంత్రం వేళ హైదరాబాద్ నాగార్జునసాగర్ హైవేపై వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్న తరుణంలో టీస్27టీ5803 నెంబర్ గల అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్ లో హైదరాబాదులోని కబేలలో గోహత్య నిర్వహించడం కొరకు అక్రమంగా తరలిస్తున్న మొత్తం 8ఆవు దూడలు,లేగ దూడలకు పట్టుకొని చింతపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరుగుతుందని ఎస్ఐ యాదయ్య వివరించడం జరిగింది.మూగ జీవాలను హింసించిన లేదా చిత్రవధకు గురిచేసిన లేదా హత్యకు పాల్పడిన అసలు చట్టాలు ఎలా ఉంటాయి.

తెలంగాణ గోవధ నిషేధ పశు సంరక్షణ చట్టం 1977ప్రకారం సెక్షన్–5:తెలంగాణలో గోవులను, దూడలను (దూడలు మగవి అయినా,ఆడవి అయినా సరే ఎట్టి పరిస్థితులలో ఉద్దెశపూర్వకంగా చంపకూడదు.సెక్షన్–6:మిగిలిన పశువులను అంటే ఎద్దు, దున్న, గేదె మొదలైనవాటిని చంపాలంటే,వాటి వయస్సు ఖచ్చితంగా 14సంవత్సరాలు దాటి వుండాలి, అలాగే వ్యవసాయానికి, బ్రీడ్ డెవలప్మెంట్ అసంపూర్తిగా నిరుపయోగంగా వున్నాయని, ప్రభుత్వము నియమించిన పశు వైద్యుడు సర్టిఫికేట్ ఇవ్వాలి. సెక్షన్8:ప్రభుత్వ వైద్యుడి సర్టిఫికేట్ ఉన్నప్పటికీ, వాటిని ప్రభుత్వ అనుమతి వున్న కబేళా (పశువధశాలలో మాత్రమే వధించాలి, రోడ్డులపై, ఇండ్లల్లో, ఎక్కడ పడితే అక్కడ పశువులను వధించడం,మాంసాన్ని విక్రయించడం నేరము.సెక్షన్11ఈ యొక్క యాక్ట్ కాగ్నిజబుల్ నేరం కింద వస్తుంది.సిఆర్ పిసి 43:-ప్రకారం ఎప్పుడైనా కాగ్నిజబుల్ నేరం జరిగినప్పుడు,ఎవ్వరైనా ప్రైవేట్ పర్సన్ అనగా మనం,నేరం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది. కావున గోవద అనేది కూడా కాగ్నిజబుల్ నేరం కింద వస్తుంది,కావున గోవద చేసే రవాణాని అడ్డుకొని అరెస్ట్ చేసే హక్కు ప్రతి ఒక్క ప్రైవెట్ పర్సన్ అనగా పౌరుడికి వుంది అనగా ఏవ్యక్తి అయినా ఆపొచ్చు తర్వాత పోలీస్ వాళ్లకు అప్పగించాలి.

అనిమల్ క్రూయల్టీ యాక్ట్ 1960: సెక్షన్ 11 ప్రకారం: హింసిస్తూ, దెబ్బలు తాకుతూ, గాలి ఆడకుండా, రక్తం వచ్చేటట్టు కట్టేయడం, ఓవర్ లోడ్ చేస్తూ, నొప్పులతో ఇబ్బంది పెడుతూ తీసుకెళ్లడం నేరం. ఏపి, టిఎస్ మోటార్ వెహికల్ రూల్స్ 1989, రూల్ 253 సుబ్ రూల్ ఏం చెబుతుంది. పశువుల రవాణాకు పాటించవలసిన నియమాలు:- (1) ఒక లారీలో 06 కంటే ఎక్కువ పశువులను రవాణా చేయకూడదు. (2)ఈ06 కూడా రవాణా చేస్తున్న సమయములో, పశువైద్యుడి ధ్రువపత్రాన్ని కలిగి వుండాలి.(3) వాహనములో పశువులతో బాటు, వాటి బాగోగులు చూసుకునే వ్యక్తి వుండాలి.(4) ప్రధమ చికిత్స పెట్టె వుండాలి (5) మేత, నీరు వుండాలి. మూసివేయబడి ఉన్న వాహనాలో పశువులను తరలించకూడదు. ఐపిసి 428, ఐపిసి 429 ప్రకారం):- పశు రవాణా సమయం లో ఏదైనా పశువు అనగా ఆవు లేదా ఎద్దు చనిపోతే ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయించాలి,ఈ సెక్షన్స్ జోడించినచొ 2 లేదా 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, కావున తప్పకుండ ఈ సెక్షన్స్ వేసేటట్టు చూడాలి. అక్రమ గోవుల రవాణా వాహనాలు మనకు కనబడగానే వాటిని ఆపి 100కి కాల్ చేసి, పోలీస్ వారికి తప్పనిసరిగా సమాచారాన్ని ఇవ్వాలి. పోలీస్ వాళ్లు పట్టుకున్న గోవులను, సురక్షితంగా రిజిస్టర్ అయినా గోశాలకు తరలించాలి. క్రమ రవాణా చేస్తున్న వారి మీద, అమ్మినవారి మీద, కోన్నవారి మీద,శిక్ష పడేలా కేసు రిజిస్టర్ వేయించాలి. పైన తెలుపబడిన చట్టాలు అక్రమాలకు పాల్పడుతున్న వారికి చుట్టాలుగా మారి మూగ జీవాలు ప్రాణాలు తీసే విధంగా ప్రోత్సహిస్తున్నాయని అర్థమవుతుంది. భారతదేశ శిక్షాస్మృతి న్యాయ సమీత విధివిధానాలను పాటించకుండా వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ. గోవధ హత్యకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న అధికారులు ప్రజా ప్రతినిధులకు అందవలసిన ముడుపులో అందడంతో గుప్పు చప్పుడు కాకుండా గోవధకు తరలిస్తున్న తీరుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కొండమల్లేపల్లి మండలం సంతలో జరుగుతున్న అక్రమాలపై నిగా పెట్టాలని కోరుతున్నారు.ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మూగజీవాలను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు.

Latest News

పోలీస్‌స్టేష‌న్‌కు నటి లావణ్య

మస్తాన్‌ సాయి, శేఖర్‌ బాషా తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ కంప్లైంట్‌ నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ను సినీ నటి లావణ్య మరోసారి ఆశ్రయించారు. బిగ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS