- కలెక్టర్‌కు ఫిర్యాదు… కనికరించని నర్సంపేట మున్సిపాలిటీ
వారు ఉదయమే నాలు గు గంటలకు లేచి నర్సంపేట పట్టణాన్ని రోడ్లన్నీ, వాడాలన్నీ ఊడు వనిదే పట్టణం పరిశుభ్రంగా ఉండదు. డ్రైనేజీ తీయనిదే పరిశుభ్రత రాదు. ఇంటింటికి నీరు అందివ్వనిదే ఆ వాడలు, ఆ ఇండ్లుకు పూట గడవదు. అయినా నర్సంపేట పట్టణాన్ని అన్ని రకాలుగా తాము శాయ శక్తుల కృషి చేస్తూ సుందరంగా తయారు చేస్తున్నప్పటికీ వారు నివసించే కాలనీలు, వార్డులు సైతం తాగునీరు లేక, డ్రైనేజీ సరిగా ఉండక, చెత్త బండ్లు కాలనీ లోకి రాక, సరైన రోడ్డు, లేక వీధిలైట్లు వెలుగక పోవడంతో ఇంకా అంధ కారంలోనే ఉంటున్నామని నర్సంపేట మున్సిపాలిటీ పట్టణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 27వ తేదీన కలెక్టర్‌కు గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఆ కాలనీలకు చుక్కనీరు రావడంలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట పట్టణంలోని 16, 23, 24 వార్డులలో ఉన్న రామ్ నగర్ లో నివసించే సుమారు వంద మంది నర్సంపేట మున్సిపాలిటీ కార్మికులు నర్సంపేట మున్సిపాలిటీలో రోడ్లను ఉడవడం, డ్రైనేజీ తీయడం, శానిటేషన్ వర్క్ చేయడం, వీధిలైట్లు వెలిగించడం, తాగునీటి వసతి కల్పించడం, కరెంట్ బల్బులు పెట్టడం వీరు చేస్తున్న పనులే అయిన ప్పటికీ వారు నివసించే కాలనీలో కనీస వసతులు లేక అల్లాడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో విధులు నిర్వహించి ఇంటికొచ్చి గుక్కెడు మంచినీళ్లు తాగుదామంటే మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తీవ్ర మనోవేదన గురవుతున్నామని వారు పేర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు మూడు పూటలా అన్నం దొరకనట్లే, భవనాన్ని నిర్మిం చిన తాపీ కార్మికులు భవనంలో ఆవాసం పొందినట్లే అన్ని రకాల విధులు నిర్వహిస్తున్న కుటుంబాలు ఈ కాలనీలో ఉన్నప్పటికీ మున్సిపాలిటీ పరంగా వచ్చే వసతుల సౌకర్యాలు అందని ద్రాక్షలాగా మారాయని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ ప్రత్యేక అధికారులు చొరవ చూపి మున్సిపాలిటీ కార్మికులు నివసించే కాలనీలో తాగునీరు, వీధిలైట్లు, డ్రైనేజీ, చెత్త సేకరణ, రోడ్లు వసతులు కల్పించాలని వేడుకుంటున్నారు.