Sunday, February 23, 2025
spot_img

అక్ర‌మ ఇసుక ర‌వాణాకు చెక్ పెట్టేనా..?

Must Read
  • జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…?
  • అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం
  • అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌, ఎస్పీ దృష్టిసారిస్తారా…?

ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో మనం పెట్టిన పెట్టుబడికి మంచి లాభం రావాలని ఆశిస్తారు అది మానవ సహజం. కానీ ఈవ్యాపారంలో మాత్రం అసలు పెట్టుబడి లేకుండానే అంతా లాభమే అని చెప్తున్నారు ఇసుకాసురులు. ఏ వ్యాపారమైన లాభనష్టాలు ఉంటాయేమో కాని ఇసుక వ్యాపారం మాత్రం నష్టాలు అసలే ఉండవు అంతా లాభమే అని అంటున్నారు. ఎందుకంటే సీజన్‌ను బట్టి ఇసుక ధరను అమాంతం పెంచేసి విక్రయించడంతో ఇక నష్టం ఏముంటుంది అంతా లాభమే కదా. ఎన్ని రోజులైనా ఇసుక అలానే నిల్వ ఉంటుంది అందుకే జిల్లాలో కొంతమంది ఇసుకాసురులు తయారయ్యారని, అడ్డూ అదుపు లేకుండా ఇసుక రవాణా సాగుతోంది అంటూ జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై జిల్లా బాసులు ఉక్కుపాదం మోపుతారా లేదా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు అమలు చేస్తారా లేక ఇసుక అక్రమ రవాణాకు కొమ్ముకాస్తారా అంటూ నిలదీస్తున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్‌, చుంచుపల్లి మండలాలతోపాటు జిల్లాలో గోదావరి పరివాహకప్రాంతమైన పినపాక, భద్రాచ లం నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులు ఉన్నాయి. గోదా వరి, కిన్నెరసాని ఇసుకకు డిమాండ్‌ ఎక్కువగానే ఉంటుంది. అదే విధంగా కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని కిన్నెరసాని వాగులో కూడా అక్రమ ఇసుక రవాణా నిరంతరం జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో నిర్మాణాలు జోరందు కోవడంతో ఇసుక ధరలకు మరింతగా రెక్కలు వచ్చాయి. సిఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందిస్తామని తెలియచేయడంతో జిల్లాలో ఇసుకాసురులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. జిల్లాలో అక్రమ ఇసుకు రవాణా అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్నా జిల్లా బాసులు ఎందుకు దృష్టిసారించడం లేందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అడ్డూ అదుపు లేకుండా ఇసుక రవాణా..
జిల్లాలో ఇసుక రవాణా అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతుంది. అక్రమ ఇసుక రవాణా దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా అన్నచందంగా నడుస్తోంది. కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతుంది. గోదావరి పరివాహక ప్రాంతాలతోపాటు కిన్నెరసాని ప్రాంతాల్లో సమీప వాగులు నుంచి ఇసుకను రాత్రి పగులుతేడా లేకుండా తోడుస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇసుక డంప్‌ ఏర్పాటు చేసుకోని రాత్రి అయ్యింది అంటే చాలు భారీ లారీల్లో జెసిబిలతో లోడ్‌ చేసి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో ప్రభుత్వానికి లక్షల రూపాయల్లో గండిపడుతోంది. సామాన్యులు ప్రభుత్వానికి చలాన్‌ కట్టినా దొరకని ఇసుక అక్రమ దారులకు మాత్రం సులభంగా లభించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగంగానే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇసుక రవాణా చేసే వ్యక్తులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లాప్రజలు కోరుతున్నారు.

జిల్లాలో అక్రమ ఇసుకరవాణాపై కలెక్టర్‌, ఎస్పీ దృష్టిసారిస్తారా?
జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జరుగతున్నా జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఎందుకు దృష్టిసారించడం లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అర్థరాత్రి సమయంలోనే అక్రమ ఇసుక దందా మరీ ఎక్కువగా ఊపందుకుంటుందని గోదావరి, కిన్నెరసాని సమీపగ్రామాల్లోని ప్రజలు ఆరోపిస్తున్నారు. అసలు అక్రమ ఇసుక రవాణా గురించి అధికారులకు తెలియకుండా ఏదీ ఉండదు. వారి కనుసన్నలోనే ఇందంతా జరుగుతున్న తమకేమీ పట్టనట్లుగా వివరించడంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాల్సిన శాఖల అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. కొత్తగూడెం, పాల్వంచ,టేకుల పల్లి, భద్రాచలం, చర్ల, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు గోదావరి, కిన్నెరసాని పరివాహక ప్రాంతాల్లో ఇసుక యధేచ్చగా అక్రమ రవాణా జరుగుతున్నా జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు ఎందుకు దృష్టిసారించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. భూగర్భ గనులు, మైనింగ్‌, రెవెన్యూ, టాస్క్‌ఫోర్స్‌, రవాణా,పోలీస్‌ యంత్రాంగం ఈ అక్రమ రవాణాపై దృష్టిసారిస్తారా లేదా సిఎం ఆదేశాలను గాలికి వదిలేస్తారో లేదా అక్రమార్కులను కట్టడి చేస్తారో వేచిచూద్ధాం.

Latest News

దండేకుంట దార్తిపాలు..

దార్తి నేచర్ ఫామ్ లో ఊహకందని అక్రమాలు అన్ని తామై వ్యవహరించిన అధికారులు రాజకీయ నేతలు ధన కుంటను మాయం చేసిన భూ మాయగాళ్లు ప్రభుత్వ భూములు కాపాడడం దేవుడెరుగు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS