Wednesday, March 12, 2025
spot_img

భగ్గుమంటున్న బంగారం..

Must Read
  • అందనంతగా రోజురోజుకూ పెరుగుదల
  • పదిగ్రాములు లక్షకు చేరడం ఖాయమంటున్న విశ్లేషకులు
  • పెళ్లిళ్ల సీజన్‌లో మరింత భారంగా ధరల పెరుగుదల

బంగారం.. బంగారమవుతోంది. అందనంతగా రోజురోజుకూ ధరల పెరుగుదల కలవరానికి గురిచేస్తోంది. పదిగ్రాములు లక్షకు చేరడం ఖాయమంటున్న విశ్లేషకుల మాటలతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో మరింత భారంగా ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది. ఇలా బంగారం, వెండి ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయి. గత మూడు నెలల్లోనే బంగారం ధరలు అమాంతంగా పదివేలకు పైగా పెరిగాయి. దీంతో దాని దూకుడు ఎలా ఉందో గమనించవచ్చు. శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో బంగారం ధరలు రోజు రోజుకు ప్రజలకు అందనంతగా పెరుగుతున్నాయి. బంగారం ధర పెరగడానికి అంతర్జాతీయ పరిణామాలు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారీఫ్‌హెచ్చరికలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత, ఫెడ్‌ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం తప్పనిసరి అవుతోంది. ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఎలా అటుఇటుగా ఒకే రేట్లను పలుకుతున్నాయి.

హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,660గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 87,990గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఇలాగే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ. 80,810 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,140గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 80,660 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్‌.. 87,990గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ. 80,660 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ. 87,990గా ఉంది. అలాగే పూణెలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 80,660 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ. 87,990గా నమోదైంది. అహ్మదాబాద్‌లో.. 22 క్యారెట్ల ధర రూ. 80,710 కాగా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 88,040గా కొనసాగుతోంది. భువనేశ్వర్‌ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,660.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 87,990గా ఉంది. దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 97,900 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 98,000గా ఉండేది. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 1,06,900గా ఉంది. కోల్‌కతాలో రూ. 99,400, బెంగళూరులో రూ. 97,900గా ఉంది. బంగారు పదిగ్రాముల ధరల లక్షకు ఏరడం ఖాయమని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Latest News

ఘ‌ట్‌కేస‌ర్ సిద్ధార్ధ కాలేజీలో ఫీజుల మోత

డబుల్ కు రెట్టింపు పెంపు అత్యల్పంగా 15%, అత్యధికంగా 30శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్ కానీ 80శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిద్ధార్థ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS