Wednesday, March 12, 2025
spot_img

కాల్వను కమ్మేసిండ్రు..

Must Read
  • ఓ ప్ర‌జాప్ర‌తినిధి అధికార బ‌లంతో కాలువ క‌బ్జా
  • మున్సిపల్ అధికారుల అలసత్వం
  • మూసి కాల్వ కబ్జా చేసి దర్జాగా నిర్మాణం
  • నార్సింగి మున్సిపాలిటిలో బరితెగించిన ఓ ప్రజాప్రతినిధి
  • భారీగా ముడుపులు తీసుకొని కామ్ గా ఉన్న అధికారులు
  • ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిప‌ల్‌ ఆఫీసర్లపై ఆరోపణలు
  • కాలువపై అ్ర‌క‌మ నిర్మాణం చేపట్టిన వైనం
  • నాయకుడి చెరనుంచి కాల్వను కాపాడాలంటున్న స్థానికులు

రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేయని దందా లేదు కావొచ్చు. కాంట్రాక్ట్ లు, కమిషన్లు, ఇతర బిజినెస్ లతో పాటు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ, అసెన్డ్, దేవాలయ భూములు, చెరువులు, కుంటలు, నాలాలు ఏవి పడితే అవి ఆక్రమించేస్తున్నారు. అమాయకులు, పేదల భూములను సైతం కొల్లగొడుతున్నారు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందో అందులో చేరిపోయి తమ దందాలు కొనసాగిస్తున్నారు. తిరిగి స్వాధీన పర్చుకోవడం, కూల్చివేతలు, కేసులు గట్రా కాకుండా జాగ్రత్త పడతారు. ‘ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా.?’ అన్న పెద్దల సామెతను నిజం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అయి ఉండి కూడా ప్రభుత్వ ఆస్తులు, దేవాలయ, చెరువులు, కుంటలు, సహజ కాల్వలను చెరబడుతుండడం సిగ్గుచేటు. రాజధాని పరిధిలో కోట్లాది రూపాయల భూములు మాయం అవుతున్నాయి. సిటీలో భూముల ధరలు అమాంతం పెరిగి పోవడంతో కొందరూ తిండి తినడం మానేసి భూములనే తింటున్నారు. ఆయా శాఖల ఆఫీసర్లతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని భూములను ఆక్రమించేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

వివ‌రాల్లోకి వ‌స్తే.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, నార్సింగి మున్సిపాలిటి పరిధిలో భూమి చాలా కాస్లీ అయిపోయింది. కాగా ఓ ప్రజా ప్రతినిధి (ఎమ్మెల్యే)గా ఉన్న పెద్దాయన భూమికి ధర ఎక్కువగా ఉండడంతో అటుగా పారుతున్న మూసీ కాల్వను ఖతం చేశాడు. సహజ కాల్వ అయిన దానిని కబ్జా చేశాడు. ఏకంగా మూసి అనుబంధ కాల్వను కబ్జాచేసి అక్కడ క‌మ‌ర్షియ‌ల్ నిర్మాణం చేసిండు.. నార్సింగి మున్సిపల్ లోని సర్వే నెం.132 లో 30 నుంచి 40 అడుగుల కాలువ వెడ‌ల్పు మేర మూసి కాల్వ పారుతుంది. దీని ద్వారా వ్యర్థ, వర్షపు నీరు వెళ్తుంది. అయితే ఊరికే పారుతున్న కాల్వపై ఓ ఎమ్మెల్యే కన్నుపడింది. ఇక వెంటనే దాన్ని పూడ్చివేశాడు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిప‌ల్‌ అధికారులను మచ్చిక చేసుకొని వారికి ఎంతో కొంత అప్పగించి తనవశం చేసుకున్నాడు. ఇంకేముంది ఆ కాల్వను కేవలం 5 ఫీట్లకు కుదించారు. ఆ కాల్వ గురించి ఎవరికి అనుమానం రాకుండా స్లాబ్ వేసి దానిపై ఓ నిర్మాణం చేపట్టారు. కాల్వను కబ్జా చేసి నిర్మిస్తే చర్యలు లేవు. తప్పు చేశారని రుజువు అయినప్పటికి వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారంటే వారి వెనుక ఎంత బలం ఉందో.. లేక అధికారులు ఎంత డబ్బు ముట్టిందోనన్న అనుమానాలు రాకమానదు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ అధ్యక్షతన హైడ్రాను స్థాపించారు. కమిషనర్ గా డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా పకడ్బందీగా ఏర్పడ్డది. ఇంకేముంది హైదరాబాద్ లో అమాయకులు, పేదలు ఇళ్లను కూల్చివేసింది. హైడ్రా అంటేనే పట్నం జనం హడలెత్తిపోయారు. ప్రభుత్వ, అసైన్డ్, చెరువులు, కుంటలు, కాల్వలు కబ్జాచేసి అక్రమంగా కట్టిన పెద్ద పెద్ద బంగ్లాలు అలాగే వదిలేశారు హైడ్రా అధికారులు. కాగా హైడ్రా కొందరికే అనే అపవాది సైతం ఆ డిపార్ట్ మెంట్ కు వచ్చింది. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. దర్జాగా చెరువులు, కుంటలు, నాలాలు ఖతం చేసి నిర్మాణాలు చేపడితే అటువైపు కూడా చూసేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఇళ్లు, ఫామ్ హౌస్ లు, హోటళ్లు, వ్యాపార సముదాయాల జోలికి పోవడం లేదంటే హైడ్రా ఎంతవరకు నిజాయితీగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ‘అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు’ హైడ్రా తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలు అరికడతామని చెప్పే ప్రభుత్వ పెద్దలు పకడ్బందీగా పనిచేయాలి. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిప‌ల్, జీహెచ్ఎంసీ అధికారులే పొలిటికల్ లీడర్లు, బడాబాబులు, కబ్జాకోరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద పెద్ద మొత్తంలో లంచాలు తీసుకుంటూ వారికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఓ ఇరిగేషన్ అధికారి ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. అనతికాలంలోనే అతగాడు చేసిన బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. సర్కారు కొలువు యలగబెడుతూ కోట్లకు పడగలెత్తిన యువ ఆఫీసర్ గురించి వచ్చిన వార్తలను చూసిన ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటివి కబ్జా కావడానికి కారకులు అలాంటి వారేనని ప్రజలు వాపోతున్నారు. అక్రమార్కులు కాల్వను చెరబట్టి నిర్మాణాలు చేపడుతుంటే అసలు పర్మిషన్ ఇచ్చిన వారు ఎవరూ, లేదంటే అనుమతి లేకుండా భవనాలు కడుతుంటే అడ్డుకోలేదు ఎందుకు. ఇంత కాలంగా ఓ నాలాను కబ్జాచేసి అక్రమంగా కాల్వపై కట్టడాలు నిర్మించి వ్యాపారాలు చేస్తుంటే మున్సిపల్ అధికారులు ఎందుకు పెనాల్టీలు వేయలేదో అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇకనైన ప్రభుత్వం, ఉన్నతాధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపై దృష్టిసారించి సంబంధిత రెవెన్యూ, నార్సింగి మున్సిపల్ అధికారులపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు. సహజ కాల్వ కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూల్చివేసి యథాస్థాయికి కాల్వ పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

గండిపేట మండ‌లంలో జ‌రుగుతున్న ప్ర‌భుత్వ భూముల క‌బ్జాల‌పై మ‌రో క‌థ‌నం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైద‌రాబాద్‌.. మా అక్ష‌రం అవినీతిపై అస్త్రం..

Latest News

ఘ‌ట్‌కేస‌ర్ సిద్ధార్ధ కాలేజీలో ఫీజుల మోత

డబుల్ కు రెట్టింపు పెంపు అత్యల్పంగా 15%, అత్యధికంగా 30శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్ కానీ 80శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిద్ధార్థ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS