Wednesday, March 12, 2025
spot_img

వీరారెడ్డి సార్ వసూల్ కా బహదూర్..

Must Read
  • ప్రయివేట్ పీఏ శివారెడ్డిని పెట్టుకుని వసూళ్ల దందా..
  • వసూల్ రాజాగా అవతారమెత్తిన పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి
  • ఇక్కడ అక్రమ నిర్మాణాలే ఈయనగారి టార్గెట్..
  • షెడ్డుకు పర్మిషన్ లేకపోయినా నో ప్రాబ్లెమ్..
  • మెస్ బిల్ కట్టాలంటూ రెండు లక్షలు డిమాండ్ చేస్తున్న వైనం..
  • ఎవరైనా ఏమైనా అంటే మా సార్ చూసుకుంటాడంటున్న శివారెడ్డి..
  • మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి వసూళ్ల దందాపై ప్రతేక కథనం ..
YouTube player

ఈయన గారు బాధ్యత గలిగిన ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి.. అక్రమ నిర్మాణాలను తన ఆదాయ మార్గాలుగా చేసుకున్నాడు.. ఏకంగా ఒక ప్రైవేట్ వ్యక్తిని తన అనుచరుడిగా నియమించుకుని వసూళ్ల పర్వంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు.. ఈయనగారి భాగోతం చూసి అందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు.. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టవేయాల్సింది పోయి అంతా తానే చూసుకుంటాను అంటూ.. ప్రభుత్వ జీవోలను పక్కన పెట్టి.. ఓ ప్రైవేట్ వ్యక్తిని అసిస్టెంట్ గా ఏర్పాటు చేసుకొని అక్రమ నిర్మాణదారుల వద్ద పోచారం మున్సిపల్ కమిషనర్ అక్రమ నిర్మాణదారులు వద్ద అడ్డగోలుగా వసూళ్లు చేస్తునట్టు స్థానికులు చేస్తున్న ఆరోపణలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి..

అవినీతిని చాక చక్యంగా హ్యాండిల్ చేస్తూ.. తనపై ఎక్కడ కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు పోకుండా.. ప్రతి ఒక్కరిని మేనేజ్ చేస్తున్న పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి టీఎస్ బిపాస్ లో పర్మిషన్ కావాలి అంటే ఎక్కువ డబ్బులు ప్రభుత్వానికి చెల్లించాలి.. ఆలా కాకుండా తక్కువలో నా పర్మిషన్ కావాలి అంటే యిస్తాను.. కానీ బయట మెస్ బిల్ కట్టాలి.. నా అసిస్టెంట్ శివరెడ్డికి కనిపించి వెళ్ళు అంటూ పోచారం మున్సిపల్ కార్యాలయాన్ని అవినీతికి అడ్డాగా మార్చాడు..

పోచారం మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసిన అక్రమ నిర్మాణాలే దర్శనం ఇస్తున్నాయి.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం.. జోడిమెట్ల సూర్య హాస్పిటల్ ఎదురుగా ఎలాంటి అనుమతులు లేకుండా భారీ షెడ్లు వెలుస్తున్నాయి.. కాగా ఇదే మున్సిపల్ పరిధిలోని కోర్రేముల సిద్ధార్థ కళాశాల పక్కనే మరో షెడ్ నిర్మాణం అవుతోంది.. ఇవే కాకుండా మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో మసీద్ పక్కనే అనుమతులు లేని మరో భారీ షెడ్ నిర్మాణం జరుగుతోంది..

వీటన్నిటినీ మించి యన్నంపేట్ ప్రధాన రహదారి పక్కనే గణేష్ విగ్రహాల తయారీకై ఎకరా స్థలంలో జీరో పర్మిషన్ తో పూర్తి కావొస్తున్న మరో భారీ అక్రమషెడ్డు కనిపిస్తుంది..

తమ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, ఇప్పటికే నిర్మాణాలు పూర్తి అయ్యాయని వాటి విషయం చూడండి అంటూ ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. నీకేమైనా డబ్బులు ఇప్పించాలా..? లేదా జరుగుతున్న పనులు ఆపించాలా..? అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతూ విషయం బయటికి రాకుండా మేనేజ్ చేస్తున్నాడు పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి..

కాగా ఓవైపు ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోతూ ఉంటే.. జిల్లాలలో ఉన్న మున్సిపల్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కొంతమంది అవినీతికి దాసోహం అయిన అధికారులు ప్రభుత్వ ఆదాయాన్ని దొడ్డిదారిలో తమ జేబులు నింపుకుంటూ.. ఏసీబీ అధికారులకు చిక్కి కోర్టుల ముందు దోషులుగా నిలబడుతున్నారు..ఇలాంటివన్నీ కామన్ అనుకుంటున్నారేమో పోచారం మున్సిపల్ కార్యాలయం సిబ్బంది..? ప్రజల కట్టే సొమ్ముతో జీతాలు తీసుకుంటూ.. అది చాలదన్నట్లు అవినీతి సొమ్ముకు అలవాటుపడ్డ ఇలాంటి తుచ్చమైన అధికారులకు ఎలాంటి శిక్షవేసినా తప్పు లేదు అంటున్నారు సామాజిక వేత్తలు.. లంచం తీసుకుంటూ చిక్కిన అధికారులను, సిబ్బందిని సస్పెండ్ చేసి వదిలేయకుండా శాశ్వతంగా విధులనుంచి తొలిగించాలని వారు కోరుతున్నారు.. మరి పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, అతని ప్రయివేట్ సెక్రెటరీ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..

Latest News

ఘ‌ట్‌కేస‌ర్ సిద్ధార్ధ కాలేజీలో ఫీజుల మోత

డబుల్ కు రెట్టింపు పెంపు అత్యల్పంగా 15%, అత్యధికంగా 30శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్ కానీ 80శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిద్ధార్థ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS