- డబుల్ కు రెట్టింపు పెంపు
- అత్యల్పంగా 15%, అత్యధికంగా 30శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్
- కానీ 80శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ
- సిద్ధార్థ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అఫీషియల్ లూఠీ
- కాలేజీని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన మారని బుద్ధి
- అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఏఎఫ్ఆర్సీ ఆఫీసర్లు
- ముడుపులు తీసుకొని యాజమాన్యానికి సపోర్ట్ ?
- ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
‘రాను రాను.. రాజు గుర్రం కంచెర గాడిద అయినట్టు’ తెలంగాణలో ఎడ్యూకేషన్ సిస్టమ్ ఆగమై పోతుంది. రాష్ట్రంలో విద్య.. వ్యాపారం అయింది. కేజీ నుండి పీజీ వరకు పెద్ద బిజినెస్ అయిపోయింది. ఎడ్యూకేషన్ సిస్టమ్ అంతా కార్పోరేట్ చేతిలో చిక్కుకుపోయింది. కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యూయేషన్ వరకు చదువు చాలా కాస్లీ అయిపోయింది. బిజినెస్ చేసేందుకు మొదలు పెట్టినట్టు స్కూల్స్, కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినయి. ఇక ఫ్రీ ప్రైమరీ, ప్రైమరీ, హైస్కూల్, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టిన వారందరూ కోట్లకు పడగలెత్తారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద, మధ్యతరగతి వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. పిల్లలు చదువు కోవాలంటే తల్లిదండ్రులు ఉన్నది అమ్ముకోవాలన్న కాడికి తీసుకొచ్చారు. ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలని ప్రకటించడం హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ రాష్ట్రంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తెలంగాణ విద్యా వ్యవస్థ ఎంత పెద్ద సంక్షోభంలో ఉందో లోతులకు పోతేనే తెలుస్తుంది. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడానికి వీలు అవుతుంది. కానీ, పాలకులు అదీ చేస్తారా లేదా అనేది డౌటే. గతేడాది జూన్ లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చూస్తే విస్తుపోయే విషయాలు బహిర్గతం అయ్యాయి. దేశంలో చదువులో మనది చివరి నుంచి 2వ స్థానం. మొత్తం 36 రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకుగాను తెలంగాణ.. విద్యా సామర్థ్యాల విషయంలో 35వ స్థానంలో ఉంది. మరీ ప్రభుత్వ, ప్రైవేట్ విద్య సంస్థలు ఎంత గొప్ప పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. పంతుల్లే చదువు చెప్పట్లేదా, అందుకు అధికారుల వైఫల్యమే కారణమా ఆలోచన చేయాలి.
ఒకప్పుడు ప్రభుత్వ.. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, విశ్వ విద్యాలయాలే ఎక్కువగా ఉండేవి. ప్రముఖులు, గొప్పవారంతా అందులో చదువుకున్నవారే. అయితే ఇప్పుడు కాస్త రివర్స్ అయింది. ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు, అటానమస్ కాలేజీలు, యూనివర్సిటీలు అధికమైపోయాయి. కార్పోరేట్ వ్యవస్థలో ఫీజుల మోత మోగిపోతుంది. వాస్తవానికి స్కూల్, కాలేజీలో ఫీజు ఎంత పెంచాలో ప్రభుత్వ, విద్య వ్యవస్థ అనుమతి (పర్మిషన్) తీసుకోవాలి. కానీ, ఈ అటానమస్ కాలంలో ఎవరికీ ఇష్టమొచ్చినట్లు వాళ్లు ఫీజులు పెంచుకోవచ్చు.. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులెటరీ కమిటీ (టీజీఏఎఫ్ఆర్సీ) పుణ్యామా అని ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. అధికారులు ముడుపులు తీసుకొని ఆయా కాలేజీలకు ఒత్తాసు పలుకుతున్నారా..? అడ్మిషన్లు సరిగా లేని, ప్రమాణాలు పాటించని వాటికి కూడా అధిక ఫీజులు వసూలు చేసే రైట్ ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూల్, కాలేజీలు నిబంధనలు పాటించకున్నా ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇందుకు ఉదాహరణే ఓ అటానమస్ కాలేజీ.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని ఘట్కేసర్ మండలంలో ఉన్న సిద్ధార్థ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇష్టారీతిన ఫీజులు వసూల్ చేస్తుంది. అటానమస్ కాలేజీకి 80% ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది.. ప్రభుత్వ, విద్య వ్యవస్థ ప్రమాణాలు అన్ని పాటిస్తున్న కాలేజీలకి కేవలం 10% ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకొంది. కానీ, సిద్ధార్థ కాలేజీకి మాత్రం మరో రకంగా పర్మిషన్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటో. ఓ ఉన్నత అధికారి ద్వంద్వ వైఖరికి ఇదే ఘటనే నిదర్శనం. అన్ని నిబంధనలు పాటిస్తున్న ఇంజినీరింగ్ కాలేజీలకు మూడేళ్లకి కలిపి అత్యల్పంగా 15 శాతం ఫీజులు పెంచే అవకాశం ఉంటుంది. కానీ, గరిష్టంగా 30% టీజీఏఎఫ్ఆర్సీ పెంచిన సందర్బాలు కూడా ఉన్నాయి. టీజీఏఎఫ్ఆర్సీ లోని ఆడిటింగ్ అధికారి యొక్క అతి తెలివితేటలు ఉపయోగించారు. ఘట్కేసర్ లోని సిద్ధార్థ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి అధిక ఫీజులు వసూల్ చేసే అనుమతి ఇచ్చారు. అటానమస్ కాలేజీ అయి ఉండి పేరు కూడా సరిగ్గా పెట్టడం రాని కళాశాలకు రూ.80 వేలు ఉన్న ఫీజు నుండి ఒక్కసారిగా రూ.1,40,000 కు పెంచడం ఎలా సాధ్యమైంది. దీనికి అధికారులు ఎలా ఓకే చెప్పారు అన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న. దీనిపై ఉన్నత విద్య వర్గాలు, ప్రొఫెసర్లు యాజమాన్యాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు సదరు కాలేజీని ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. సిద్ధార్థ కాలేజీని బ్లాక్ లిస్ట్ లో పెట్టినా యాజమాన్యానికి బుద్ధి మారలేదని మేధావులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో నిబంధనలు పాటించని, అర్హత లేని ఫ్యాకల్టీతో నడుపుతున్న స్కూల్స్, కళాశాలలు, ఇంజినీరింగ్, అటానమస్ కాలేజీలపై ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించాలని, అధిక ఫీజులు వసూల్ చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.