Friday, May 9, 2025
spot_img

చికెన్ షాప్ లో మ‌త్తుప‌దార్దాల‌ విక్రయాలు..

Must Read

నిందితుడి అరెస్ట్, కేసు నమోదు చేసిన ఎస్ఐ నర్సింహారావు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్లో గల ఎజెఆర్ చికెన్ షాప్ లో గ‌*జాయి విక్రయాలు జరుగుతున్నాయనే నమ్మదగిన సమాచారంతో మొయినాబాద్ పోలీసులు దాడి నిర్వహించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఎస్ఐ ఆర్.నరసింహరావు నేతృత్వంలో పోలీసులు బుధవారం షాప్ ను పూర్తి తనిఖీ చేయగా 2.5 కిలోల గ‌*జాయి దొరికింది. దీంతో పోలీస్ బృందం షాప్ లో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాగా చికెన్ షాప్ లో ఉన్న మహబూబ్ (25), అజీజ్ నగర్ లో ఉంటూ గ‌*జాయి విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గ‌*జాయి సరఫరా వెనుక ఉన్న ముఠాను పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టామని మొయినాబాద్ ఎస్ఐ నరసింహ రావు తెలిపారు. నిషేధిత గ‌*జాయి, డ్రగ్స్ సప్లయ్ చేసినా, అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మొయినాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు హెచ్చరించారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS