- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే యోచన
ఉద్యోగాల కోతలు, దేశాలపై సుంకాలతో దూకుడు పాలన సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పదుల కొద్దీ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అంశాన్ని ట్రంప్ సర్కారు పరిశీలిస్తున్నారని సమాచారం. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల విూడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఒక ఇంటర్నల్ మెమో బయటికొచ్చింది. అందులో మొత్తం ఈ 41 దేశాలను మూడు గ్రూప్‌లుగా విభజించినట్లు సమాచారం. పది దేశాలతో ఉన్న మొదటి గ్రూప్‌లో అఎª`గానిస్థాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తరకొరియా వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దేశాల పౌరులకు వీసాల జారీ పూర్తిగా నిలిపివేయ నున్నారని ప్రచారం. ఇక, రెండో గ్రూప్‌లో ఇరిట్రియా, హైతీ, లావోస్, మయన్మార్, దక్షిణ సూడాన్ దేశాలున్నాయి. వీటిపై పాక్షిక ఆంక్షలు అమలుచేయనున్నారని ఆ మెమోలో పేర్కొన్నారు. ఈ దేశాలకు పర్యటక, విద్యార్థి వీసాల వంటివి జారీ చేయకూడదని భావిస్తున్నారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులు కల్పించే అవకాశాలున్నాయి. మూడో గ్రూప్‌లో పాకిస్థాన్, భూటాన్ సహా 26 దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దేశాలు 60 రోజుల్లోపు తమ ’లోపాలను పరిష్కరించుకోవడానికి’ ప్రయత్నాలు చేయకపోతే అక్కడి పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపివేయాలని యూఎస్ యంత్రాంగం భావిస్తున్నట్లు ఆ మెమోలో ఉంది. ప్రస్తుతానికి ఈ జాబితాను అమెరికా విూడియా సంస్థలు ప్రచారం చేయగా.. ఇందులో మార్పులు ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదం తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇరాన్ సహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాల ప్రయాణికులపై నిషేధం విధించారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఇక, 2023లోనూ ట్రంప్ ఈ ప్రణాళికల గురించి ప్రస్తావించారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపడితే గాజా స్టిప్ర్, లిబియా, సోమాలియా, సిరియా యెమెన్ వంటి దేశాల నుంచి పౌరుల రాకపై ఆంక్షలు విధిస్తానని తెలిపారు. దేశ భద్రతకు ముప్పు అని భావించేవారిని అమెరికాలోనికి ఎన్నటికీ రానివ్వబోమని అన్నారు.