Monday, March 17, 2025
spot_img

30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా:..

Must Read
  • ముడుపుల మత్తులో జోగుతున్న ఎమ్మార్వో, తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్..!
  • వండర్లా ఆనుకుని విలాసవంతమైన డ్యూప్లెక్స్ విల్లాల నిర్మాణలు
  • అక్రమ పద్దతిలో జరుగుతున్న క్రయవిక్రయాలు..
  • మొద్దునిద్రపోతున్న ప్రభుత్వ యంత్రాంగం..!
  • ఆరున్నర ఎకరాలకు పర్మిషన్.. ఎనిమిదిన్నర ఎకరాల్లో నిర్మాణాలు..
  • రేరా అనుమతులు లేవు.. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం..
  • ప్రభుత్వ భూమిని కాపాడటంలో విఫలమైన మహేశ్వరం ఎమ్మార్వో
  • అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్..
  • బి.ఆర్.ఎస్. నాయకుడు తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్, బినామీలతో నిస్సిగ్గుగా సాగిస్తున్న రియల్ వ్యాపారం..
  • గేటెడ్ కమ్యూనిటీకి పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేస్తున్న ధ్రువపత్రాలు..
  • ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్..

బీఆర్ఎస్ పార్టీలో పేరున్న నాయకుడు ఈయన.. జెడ్.పీ.టి.సి.గా విధులు, రియల్ ఎస్టేట్ లో చేయితిరిగిన వ్యక్తి.. ఈయనను ప్రతి ఒక్కరూ గుర్తు పడతారు.. ఇదే అతనికి కలిసొచ్చిన అంశం.. ఈ పరిస్థితిని ఆసరాగా, తనకు అనుకూలంగా మలుచుకున్నాడు.. ఇంకేముంది తన సన్నిహితులతో, కొంతమంది బినామీలను సృష్టించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించడం మొదలు పెట్టాడు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యడం తప్పుకాదు.. కానీ చట్ట విరుద్ధంగా నిర్వహించడం.. తన వెంచర్ కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించడం నేరం అవుతుంది.. ఇతగాడి నేర సామ్రాజ్య విస్తరణకు కొందరు అవినీతి అధికారులు కూడా సహకరించడం దురదృష్టకరం.. అసలు వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఉప్పల వెంకటేష్ గుప్తా ఈయన పేరున్న వ్యక్తి.. తనకున్న పలుకుబడిని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.. వండర్లాను ఆనుకొని విలాసవంతమైన డూప్లెక్స్ విల్లాలు నిర్మించి, అక్రమ పద్ధతిలో క్రయవిక్రాయాలు జరుపుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.. ఇంత జరుగుతున్నా ఇలాంటి అక్రమార్కులపై ప్రభుత్వ యంత్రాంగం ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది..

ఈయన గారు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, తలకొండపల్లి జెడ్పిటిసిగా విధులు నిర్వహిస్తున్నాడు.. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టే వ్యక్తి.. తమ సన్నిహితులతో, బినామీలతో అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.. కాగా ‘ఆదాబ్ హైదరాబాద్ ‘ నిఘా విభాగం పరిశోధనలో కళ్ళు చెదిరే నిజాలు బయటపడ్డాయి..

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు దూరంలో వండర్లా పక్కన అనుకొని ఉన్న సర్వే నెంబర్స్ 430, 431, 325, 427పీ, 429పీ.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర ఖుర్ద్(ఎ) గ్రామం.. ఇక్కడ విలాసవంతమైన డూప్లెక్స్ నిర్మాణాలు పదుల సంఖ్యలో నిర్మించి.. ఈ గేటెడ్ కమ్యూనిటీ చుట్టూరా ప్రహరీ నిర్మించి.. ఆరున్నర ఎకరాల్లో హెచ్ఎండిఏ లేఔట్ (041598/ఎల్.టి/జెడ్ఏ/ఎఫ్ ఎల్.టి/యూ6/హెచ్.ఎం.డి.ఏ/02012021) అనుమతులు తీసుకొని.. ఎనిమిదిన్నర ఎకరాల విస్తీర్ణంలో విల్లాల నిర్మాణం చేపట్టారు.. గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు లేవు.. కానీ గేటెడ్ కమ్యూనిటీ ప్రహారీ నిర్మాణం చేపట్టారు.. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం..

తెలంగాణ రేరా అనుమతులు తీసుకోలేదు.. ఈ విషయంపై సంబంధిత హెచ్ఎండిఏ అధికారులను ప్రశ్నిస్తే మేము లేఔట్ కు మాత్రమే పర్మిషన్ ఇచ్చాము, గేటెడ్ కమ్యూనిటీ కి పర్మిషన్ ఇవ్వలేదు.. అని వ్యక్తపరచిన ధ్రువపత్రాలు ఆదాబ్ టీమ్ సేకరించడం జరిగింది.. కాగా సర్వే నెంబర్ 432 భూదాన భూమి విషయంపై పరిశోధించిన అనంతరం ఇక్కడ కబ్జాకు గురైన 432లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని మహేశ్వరం ఎమ్మార్వోని కోరితే.. అతను ముందే డబ్బులకు అమ్ముడుపోయి.. రెవెన్యూ సూచిక బోర్డును వేరే ప్రదేశంలో పాతి.. బోర్డు పాతాము ఆ రెండు ఎకరాల భూమి కాపాడుము అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.. .ఈ విషయంపై లోకల్ మున్సిపాలిటీ అయిన తుక్కుగూడ కమిషనర్ కి ఫిర్యాదు చేస్తే.. తనకు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం దారుణం.. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఇంటీరియల్ పర్మిషన్లు ఈ మున్సిపాలిటీ నుండి ఈ కమిషనరే స్వయంగా ఇచ్చారని తెలిసింది.. ఇది మరింత విడ్డూరం.. సబ్ రిజిస్ట్రార్ ఈ విషయాన్ని గ్రహించి.. రిజిస్ట్రేషన్లు ఆపి.. ఉన్నత అధికారులకు తెలియపరచి.. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలని కోరితే.. నాకేం అవసరం..? నేను చార్మినార్ ను అమ్మినా రిజిస్ట్రేషన్లు చేస్తానని దురుసుగా మాట్లాడటం ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తున్న విషయం..

ఈ విషయంపై స్థానిక జిల్లా కలెక్టర్, రేరా రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.. మరిన్ని ఆధారాలతో మరిన్ని సంచలన విషయాలను మీముందుకు తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌ దమ్మాయిగూడ

విచ్చలవిడిగా మున్సిపల్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు చీర్యాల్‌లో ఫామ్‌ హౌస్‌ నిర్మాణానికి మున్సిపల్‌ అధికారి అండదండలు అటువైపు కన్నెత్తి చూడని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మేడ్చల్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS