Monday, March 17, 2025
spot_img

బడంగ్ పేట్ గ్రీన్ బెల్ట్ లో తప్పుడు దస్తావేజులతో రియల్ దందా

Must Read
  • గ్రీన్ బెల్టు 63 ఎకరాలను మింగేసిన ఘనుడు 24వ వార్డు మాజీ కౌన్సిలర్ ఏనుగు రాంరెడ్డి..!
  • కాలంచెల్లిన గ్రామ పంచాయతీ దొంగ డాక్యుమెంట్లతో ఇంటి నంబర్లు, రిజిస్ట్రేషన్లు..!
  • సర్వే నెంబర్ 125లో నిర్మాణ అనుమతులు తీసుకొని గ్రీన్ బెల్ట్ 124లో భారీ కమర్షియల్ నిర్మాణం..
  • బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ సరస్వతి స్పందించడం లేదు..
  • ముడుపులు తీసుకుని ఫిర్యాదులను మూటగట్టి అటకెక్కించిన వైనం..
  • మున్సిపల్, విజిలెన్స్, ఏసీబీ నిఘా విభాగాలు తనిఖీ చేస్తే భారీ అవినీతి బట్టబయలవుతుంది..

ముడుపుల మూటలు వెనకేసుకుంటున్న ప్రభుత్వ అధికారిణి.. గ్రీన్ బెల్ట్ భూములనే మింగేసిన ఓ రాజకీయ నాయకుడు.. ఇంకేముంది ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో చేపట్టిన చర్యలు కానరాకుండా పోయాయి.. దొంగ డాక్యుమెంట్స్ సృష్టించడం.. ఇంటి నెంబర్లు తెచ్చుకోవడం.. రిజిస్ట్రేషన్లు చేసుకోవడం.. మూడు పూవులు ఆరుకాయల్లా తప్పుడు రియల్ దందా యథేచ్ఛగా సాగుతోంది.. దీనికి అడ్డుకట్టవేసే వారు లేకపోవడంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా నడిచిపోతోంది.. బడంగ్ పేట్ గ్రీన్ బెల్ట్ పరిధిలో వెలుగుచూసిన కబ్జా భాగోతం మీకోసం..

హైదరాబాద్ మహానగరం విశ్వ నగరంగా ఇంతకింతకు పెరుగుతూ అభివృద్ధి చెందుతున్న దశలో ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ ను దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తు మానవ మౌలిక వసతులు వివిధ అంశాలకు అనుగుణంగా అప్పటి భవిష్యత్తు నిర్మాణ నిపుణులు బడంగ్పేట్ మున్సిపాలిటీలో కల ఓ ప్రాంతాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు.. ఇక్కడ గ్రీన్ జోన్ అంటే పార్కులు, పాఠశాలల కోసం ఏర్పాటుచేసిన స్థలం.. అయితే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ స్థానిక కౌన్సిలర్ ఏనుగు రామిరెడ్డి తప్పుడు డాక్యుమెంట్లతో, కాలం చెల్లిన గ్రామ పంచాయతీ లేఔట్, హౌస్ నెంబర్లతో మున్సిపాలిటీతో ముడుపులు చెల్లించి, హౌస్ నెంబర్లు మంజూరు చేయించుకుని, అక్రమంగా ఇళ్లను నిర్మించి, భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, వాటిపై అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనడానికి ఈ వార్త కథనం నిదర్శనం.. బడంగ్ పేట్ మున్సిపాలిటీ 24వ వార్డు, సర్వేనెంబర్ 122, 123, 124, 129లలో అల్మాస్ గూడా విలేజ్, బాలాపూర్ మండల్.. ఇది పూర్తిగా గ్రీన్ బెల్ట్ ఓపెన్ స్పేస్ జోన్.. దాదాపు ఈ స్థల విస్తీర్ణం 63 ఎకరాలుగా ఉంటుంది. దీని మీద అక్రమ పద్ధతిలో, వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చేపట్టి, అమాయకపు ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకున్న పరిస్థితి దాపురించింది.. భవిష్యత్తులో హైడ్రా లాంటి సంస్థ ఏదైనా ఈ స్థానిక నివాసాలపై చర్యలు తీసుకుంటే అక్కడ కొన్నవారి గదేం కాను..? ఈ పరిస్థితి ఇలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చట్టసభలో గ్రీన్ జోన్ ఎత్తేయాలని విన్నవించడం కొసమెరుపు.. టి.ఆర్.ఎస్. హయాంలో కానిది కాంగ్రెస్ హయాంలో ఎలా అవుతుందో ఆ భగవంతునికే ఎరుక..!

బడంగ్ పేట్ 24వ వార్డు అల్మాస్ గూడా, గ్రీన్ బెల్ట్ అనుకోని 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డును ఆక్రమించి మున్సిపల్ అనుమతులు లేకుండా, భారీ కమర్షియల్ బిల్డింగ్ లను నిర్మించడానికి లక్షల్లో ముడుపులు తీసుకుని అధికారులే ప్రోత్సహిస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది..

సర్వేనెంబర్ 125లో నిర్మాణ అనుమతులు తీసుకొని గ్రీన్ బెల్ట్ 124లో భారీ కమర్షియల్ నిర్మాణం..

ఫైల్ నెంబరు 004449/బీపీ/డీటీసీపీ/3037/0009/2023, పర్మిట్ నెంబర్ 0015/బీపీ/3037/2023..

అల్మాస్ గూడా, సర్వే నెంబర్ 125, ప్లాట్ నెంబర్ 556లో పర్మిషన్ .

ప్రస్తుతం నిర్మిస్తున్నది 124 ఓపెన్ స్పేస్ (గ్రీన్ బెల్ట్) సర్వే నెంబర్ లో ..

అనుమతులు ఒకచోట.. నిర్మాణం గ్రీన్ బెల్ట్ లో.. స్థానిక కౌన్సిలర్ ఏనుగు రాంరెడ్డి సదరు బిల్డింగ్ యజమానితో లక్షల్లో ముడుపులు తీసుకుని దగ్గరుండి అక్రమ నిర్మాణాన్ని సక్రమం చేస్తున్న పరిస్థితి నెలకొంది.. ఈ అవినీతి తతంగాన్ని మున్సిపల్ కమిషనర్ సరస్వతి దృష్టికి తీసుకువెళ్తే ఆమె ముడుపులు అందుకొని తప్పించుకుంటూ తెలివిగా వ్యవహరించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..

ఈ అవినీతి, అక్రమాలపై.. అక్రమ నిర్మాణాలపై ఎస్టిఎఫ్ ఇంచార్జ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక జనం వేడుకుంటున్నారు…

బడంగ్ పేట్ మున్సిపాలిటీలో భవిష్యత్తు ప్రజల ఉపయోగాల కోసం, గ్రీన్ బెల్ట్ ఓపెన్ స్పేస్ గా కేటాయించిన వివరాలు :
24 వ వార్డులో 63 ఎకరాలు..

(వార్డు నెంబర్ 4) అల్మాస్ గూడ విలేజ్, సర్వేనెంబర్ 84, 85, 86 ఓపెన్ స్పేస్ (గ్రీన్ బెల్ట్) గా 28 ఎకరాలు నిర్ణయించబడ్డాయి..
(వార్డు నెంబర్ 30) బడంగ్ పేట్, సర్వే నం 148,149 ఓపెన్ స్పేస్ 17 ఎకరాలు (గ్రీన్ బెల్ట్) గా నిర్ణయించబడ్డాయి..

కాగా దాదాపు 100 ఎకరాల స్థలాన్ని మాస్టర్ ప్లాన్ లో భవిష్యత్తు ప్రజల అవసరాల కోసం.. ఆటో స్థలాలు, పార్కుల కోసం ప్రభుత్వం కేటాయించింది.. ఈ విషయంపై అందరికీ అవగాహన ఉన్నా.. దీనిలో గృహ నిర్మాణానికి హౌస్ నెంబర్లు.. తద్వారా రిజిస్ట్రేషన్లు.. ఎలా జరుగుతున్నాయన్నది మిస్టరీగా మారింది.. అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకుని, అవినీతికి పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది..

ఈ విషయంపై.. బడంగ్ పేట్ మున్సిపల్ ఇంచార్జ్ స్పెషల్ ఆఫీసర్.. పి. శ్రీనివాస్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మున్సిపల్ శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి సత్వరమే స్పందించి.. ఈ భారీ అవినీతిపై చర్యలు తీసుకోవాలని స్థానిక జనం, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు..

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌ దమ్మాయిగూడ

విచ్చలవిడిగా మున్సిపల్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు చీర్యాల్‌లో ఫామ్‌ హౌస్‌ నిర్మాణానికి మున్సిపల్‌ అధికారి అండదండలు అటువైపు కన్నెత్తి చూడని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మేడ్చల్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS