- జీ.హెచ్.ఎం.సి. ఎల్బీనగర్ జోన్, టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి పరాకాష్ట..
- ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి రూ. 10 లక్షలు లంచం తీసుకొని అనుమతులు మంజూరు..
- టి.ఎస్.బి.పాస్ వెబ్ సైట్ పారదర్శకత లేకపోవడాన్ని అలుసుగా చేసుకున్న వైనం..
- అదే పనిగా అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..
- సబ్ రిజిస్ట్రార్ సైతం లక్షల్లో ముడుపుల అందుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు..!
- ఎల్బీనగర్ జోన్ సర్కిల్ – 3 డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య డైరెక్షన్ లోనే అవినీతి తంతు..!
- ఎల్బీనగర్ జోన్ లో అవినీతి అక్రమాలపై ఆర్టిఐలకు, ఫిర్యాదులకు స్పందించని అధికార గణం..
- ఎస్.టి.ఎఫ్. కూడా అవినీతిలో అంతర్భాగమే అనడానికి ఈ వార్త కథనం నిదర్శనం..
పూర్తి ఆధారాలతో అధికారుల దొంగతనాన్ని ఎండగడుతూ వార్తా కథనాన్ని వ్రాస్తున్నాము, దీనిపై జి.హెచ్.ఎం.సి. నగర మేయర్, హైడ్రా చైర్మన్ రంగనాథ్, మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి.. ఇది కలర్ లో సబ్ లీడ్ పెట్టాలి.. నిషేధిత జాబితాలో ఉన్నా లెక్కలేదు.. కోర్టును తప్పుదోవ పట్టించడం కబ్జాకోరులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది.. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నా పద్ధతి మార్చుకోవడం లేదు.. డిప్యూటీ కమిషనర్ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి కబ్జాదారులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాడు.. దానం మూలం ఇదం జగత్ అన్న నానుడిని జీజం చేస్తూ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నాడు.. తన బొక్కసం నిండితే చాలు, ప్రభుత్వ విధి విధానాలు, చట్టాలు, న్యాయ వ్యవహారాలు ఇవేమీ పట్టించుకోవడం లేదు.. ఇలాంటి అధికారులపై అలసత్వం ప్రదర్శిస్తే భవిష్యత్తులో ప్రమాదకరంగా మారిపోతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు

జిహెచ్ఎంసి, ఎల్బీనగర్ జోన్ సర్కిల్ – 3 పరిధిలోని నాగోల్ డివిజన్, సర్వేనెంబర్ 87/4, నాగోల్ విలేజ్, ఉప్పల్ మండలం.. ఇక్కడ ఇంచుమించు 2 ఎకరాల ప్రభుత్వ భూమి లావణ్య పట్టా నిషేధ జాబితాలో ఉంది.. కానీ ఓ కబ్జాకోరు కోర్టును ఆశ్రయించి, కోర్టును తప్పుదోవ పట్టించి, ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా మింగేద్దాం అనే ఆలోచనతో తన కుయుక్తులతో చాకచక్యాన్ని ప్రదర్శించాడు.. కానీ కోర్టు మాత్రం కబ్జాకోరుకు అనుకూలంగా కాకుండా.. కోర్టులో దీనికి సంబంధించిన కేసు ఇంకా జరుగుతూ ఉంది.. కోర్టు కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. డబ్ల్యు.పీ. 45583/2016, పిట్ట హరినాథ్ రెడ్డి మరియు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్టిక్ కలెక్టర్ రంగారెడ్డి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రంగారెడ్డి, సబ్ రిజిస్ట్రార్ బైరాములగూడా, తహసిల్దారు ఉప్పల్.. మధ్య కేసు నడుస్తున్న పరిణామం నెలకొంది.. అయితే కేసు పెండింగ్ లో ఉన్న దరిమిలా కోర్టు ఎలాంటి డైరెక్షన్లు ఇవ్వకుండానే.. మున్సిపల్ అధికారులు పదుల సంఖ్యలో ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు. ఈ లావణ్య పట్టాకు గవర్నమెంట్ నుండి ఎలాంటి కన్విన్స్ డీడ్ మంజూరు చేయకపోవడం గమనార్హం..
జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ సర్కిల్ – 3 టౌన్ ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్ కుమ్మక్కై ఒక్కో నిర్మాణ అనుమతికి రూ. 10 లక్షల చొప్పున లంచాలు తీసుకొని ఏకంగా ప్రభుత్వ స్థలంలో అనుమతులు ఇచ్చారు.
దీనికి సంబంధించిన ఆధారాలు ఇలా ఉన్నాయి :
1) పర్మిట్ నెంబర్ : 334202/9991/జీ.హెచ్.ఎం.సి./2023
2) పర్మిట్ నెంబర్ : 334198/9995/జీ.హెచ్.ఎం.సి./2023
3) పర్మిట్ నెంబర్ : 334196/9997/జీ.హెచ్.ఎం.సి/2023
4) పర్మిట్ నెంబర్ : 334194/9998/జీ.హెచ్.ఎం.సి/2023
5) పర్మిట్ నెంబర్ : 334188/9999/జీ.హెచ్.ఎం.సి./2023
6) పర్మిట్ నెంబర్ : 334183/10001/జీ.హెచ్.ఎం.సి./2023
7) పర్మిట్ నెంబర్ : 334176/10003/జీ.హెచ్.ఎం.సి. /2023
8) పర్మిట్ నెంబర్ : 334166/10004/జీ.హెచ్.ఎం.సి./2023

కాగా ఈ విషయంపై పూర్తి ఆధారాలతో సామాజిక కార్యకర్తలు రాతపూర్వక ఫిర్యాదులు ఇస్తే.. ఫిర్యాదులను, ఆర్టిఐని తొక్కిపెడుతున్నాడు డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య.. ఈ విషయంపై జోనల్ కమిషనర్ ని, ఎస్టిఎఫ్.టీంని ప్రశ్నిస్తే ఏలాంటి జవాబు చెప్పకపోవడం అవినీతికి అమ్ముడుపోయారు అనడానికి నిదర్శనం..
ఎన్నో పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రం.. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ విశ్వనగరం రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ ప్రపంచ అత్యాధునిక పట్టణాలతో పోటీపడుతూ.. ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచే దిశగా భవిష్యత్ కార్యాచరణను దృష్టిలో ఉంచుకొని గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం టి.ఎస్.బి పాస్ కొత్త మున్సిపల్ చట్టాన్ని అమలుచేసి, ఎలాంటి అవినీతికి తావు ఉండకుండా , అక్రమ నిర్మాణాలు వెలిస్తే వితౌట్ నోటీస్ కూలగొడతాం అన్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి..

టీ.ఎస్.బి.పాస్ వెబ్ సైట్ పారదర్శకత లోపం : బరితెగించి అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ ప్రభుత్వ అవినీతి అధికారులు :
సామాన్యునికి సులువుగా ఉండే విధంగా చట్టాన్ని తీసుకువస్తే.. టి.ఎస్.బి పాస్ వెబ్ సైట్ ను ఆపరేట్ చేసే ఉన్నత అధికారులు.. లంచాలకు అమ్ముడుపోయి.. సొంత ప్రయోజనాల కోసం తప్పులు చేయడానికి వారు చేసే తప్పులు కనబడకుండా.. పారదర్శకత లేకుండా.. ఎక్కడికక్కడ కట్టడి చేశారు.. టీఎస్ డిపార్స్ వెబ్ సైట్ లోకి వెళ్లి సిటిజన్ సెర్చ్ లో గాని, ఇతర పారదర్శకత ఆప్షన్ లో గానీ సమాచారం వెదికితే ఎలాంటి సమాచారం కూడా దొరకని పరిస్థితి నెలకొంది.. లాగా ఇదే అదునుగా చేసుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు అధిక మొత్తంలో లంచాలకు కక్కుర్తిపడి ప్రభుత్వ స్థలాల్లో, పార్కు స్థలాల్లో, ప్రభుత్వ నిషేధిత స్థలాల్లో అనుమతులు ఇచ్చి కోట్లు గడించారు.. అదేవిధంగా , ఇరికిరుకు భారీ భవంతులకు, వాణిజ్య సముదాయాలకు అక్రమ పద్ధతిలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు.. వేలల్లో జారీ చేశారు.. ఒక్కసారి టి ఎస్ బి పాస్ వెబ్ సైట్ పై.. ఏ.సీ.బీ. లాంటి సంస్థతో ఎంక్వయిరీ చేస్తే.. వేలకోట్ల కుంభకోణం బయటికి వస్తుంది అనడంలో అనుమానమే లేదు..

డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య డైరెక్షన్ లో అంతులేని అవినీతి తంతు :
జిహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ సర్కిల్ – 3 పరిధిలోని, నాగోల్ డివిజన్ సర్వేనెంబర్ 87/4, నాగోల్ విలేజ్, ఉప్పల్ మండలం.. ఈ ప్రభుత్వ స్థలంలో గృహ నిర్మాణ అనుమతులు డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య డైరెక్షన్ లోనే జరిగాయి అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి..

టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిసి తెలియక ఇచ్చారనుకుందాం.. మరి ఉన్నత స్థాయి అధికారి అయిన డిప్యూటీ కమిషనర్ పరిశీలించకుండా అనుమతులు ఎలా మంజూరు చేస్తారు..? ఆ జిహెచ్ఎంసి నిర్మాణ అనుమతుల ప్రకారం, అక్రమ నిర్మాణాలకు అసెస్మెంట్లు, హౌస్ నెంబర్లు మంజూరు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో గ్రహించాలి.. సరే నిర్మాణ అనుమతులు ఇచ్చారు.. ఇంటి నంబర్లు ఎలా మంజూరు చేశారు..? సరే తెలియలేదు.. చదువుకోలేదు అనుకుందాం..! మరి సామాజిక ఉద్యమకారులు పూర్తి ఆధారాలతో వ్రాతపూర్వక ఫిర్యాదు చేసి మూడు నెలలు గడిచినా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక దాగివున్న కుట్రను ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి.. ఎంత అవినీతికి పాల్పడ్డా.. శాఖా పరమైన చర్యలు లేకపోవడం.. ఉన్నతాధికారులు మాటలతోనే సరిపెట్టడం.. పరిపాటిగా మారడంతో.. దీనిని అలుసుగా తీసుకుని అవినీతికి పాల్పడుతూ కోట్లకు పడగలెత్తుతున్నారు ఈ సోకాల్డ్ అవినీతి అధికారులు..
పూర్తిగా విఫలమైన ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, ఎస్.టి.ఎఫ్. టీమ్ :
టి.ఎస్.బి పాస్ కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం, అవినీతి, అక్రమ నిర్మాణాలపై స్థానిక మున్సిపాలిటీ అధికారికి, కలెక్టర్ స్థాయి అధికారులకు పూర్తి అధికారాలు ఉంటాయి.. (ఎస్టిఎఫ్) స్పెషల్ టాస్క్ఫోర్స్ టీంని ఏర్పాటు చేసుకొని అక్రమ నిర్మాణాలను నిలువరించాలి.. చట్టం తెలియక ఈ అధికారులు ఉన్నత స్థాయి అధికారులను తికమక పెడుతూ.. కోర్టును పక్కదోవ పట్టిస్తూ.. అంతా గందరపరిస్థితులు సృష్టిస్తున్నారు..
ఎల్బినగర్ జోనల్ కమిషనర్ ఐ.ఏ.ఎస్ కేశవ పాటిల్ గారు ఒక ఐ.ఏ.ఎస్ గా హుందాగా విధులు నిర్వహించినా.. కిందిస్థాయి అధికారులు బరితెగించి అవినీతికి పాల్పడుతున్నారు అనడానికి ఎన్నో ఆధారాలున్నాయి.. ఈ ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలపై ఆరు నెలలు గడిచినా ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక అంతర్యం ఏమిటో ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి.. జోనల్ కమిషనర్ కి టౌన్ ప్లానింగ్ సబ్జెక్టు తెలియక పోవడం.. ఆయన భయపడుతూ చాలావరకు ఫైళ్లను తొందరగా ఆమోదించక పోవడం.. ప్రతి ఫైలు క్షేత్రస్థాయిలో పరిశీలించడం బాగానే ఉంది.. కానీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం (ఎస్.టి.ఎఫ్) దీనిపై దృష్టి పెట్టకపోవడం.. ప్రభుత్వ అధికారులే కదా అని.. వారికి పనుల పురమాయించడం.. వారు తిరిగి అబద్ధపు సమాధానాలు, సమాచారం అందిస్తే దాన్ని గుడ్డిగా నమ్మడం.. ఆ.. సారుకు ఏం తెలుసులే..? అనుకుంటూ కిందిస్థాయి అధికారులు ఎదేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారు. ఇకనైనా జోనల్ కమిషనర్ కేశవ్ పాటిల్ ఈ విషయంపై దృష్టి సారించి.. కళ్ళు తెరిచి.. ప్రభుత్వ స్థలాలను కాపాడాలని.. అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని స్థానిక జనం ప్రార్థిస్తున్నారు..
జి.హెచ్.ఎం.సి కమిషనర్ ఇలంబర్తి , హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డిలు స్పందించి.. ఈ అవినీతి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక జనం డిమాండ్ చేస్తున్నారు..
ఉప్పల్ సబ్ రిజిస్టార్ అక్రమ రిజిస్ట్రేషన్ల పై ప్రత్యేక కథనం..మీకోసం వెలుగులోకి తీసుకురానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘ ..