Monday, March 17, 2025
spot_img

సేంద్రియం జాడేది..?

Must Read
  • నిరుపయోగంగా సెగ్రిగేషన్‌ షెడ్లు
  • ఎక్కడా కనిపించని సేంద్రియ ఎరువుల తయారీ
  • ఊరు చివర్లో చెత్తను తగలబెడుతున్న వైనం
  • ప్రజాధనం దుర్వినియోగం
  • నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో 22 గ్రామపంచాయతీలలో నిర్మించిన కంపోస్టు షెడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇంటింటా సేకరించిన చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామ శివారులో నిర్మించిన షెడ్లు నిర్వహణ లోపంతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి.వీటిపై పంచాయతీ సిబ్బంది కూడా దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉన్నతాశయంతో గత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంపోస్ట్‌ షెడ్లు నిరుపయోగంగా మారాయి. గ్రామాల్లో సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసి గ్రామ పంచాయతీలలో ఆదాయం పొందాలనే సదుద్దేశంతో వీటి నిర్మాణం చేపట్టారు. కానీ ఎక్కడా వినియోగంలో ఉన్నట్టు కనిపించడం లేదు.పాలకవీడు మండల పరిధిలోని గ్రామాల్లో 22 కంపోస్ట్‌ షెడ్లను నిర్మించారు. ఒక్కో షెడ్డు నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ నిధులు రూ.2.50 లక్షలు ఖర్చు చేసింది.

కంపోస్ట్‌ షెడ్లలో తడి, పొడి చెత్తను వేరు చేసి ఎరువు తయారీతోపాటు వానపాములను ఉత్పత్తి చేయాలని వీటిని నిర్మించారు. ఇక్కడ తయారైన ఎరువును రైతులకు విక్రయిస్తే పంచాయితీకి కొంత ఆదాయం సమకూరుతుంది. కానీ చెత్తతో ఎరువులు తయారు చేస్తున్న ఘటనలు ఏ ఒక్క గ్రామంలో మచ్చుకైనా కనిపించడం లేదు. డంపింగ్‌ యార్డ్‌ లకు చెత్తను తీసుకురాకుండా పాత వ్యవసాయ బావులలో, రోడ్ల వెంట గుంతల్లో పడేస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యన్ని, స్వచ్ఛతను మెరుగుపరచాలని ప్రభుత్వం భావించింది. ప్రత్యేక పాలనలో పట్టించుకోక పోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుందని పలువురు భావిస్తున్నారు.

తడి లేదు-పొడి లేదు:
నిత్యం ట్రాక్టర్ల ద్వారా తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డ్‌ లకు తరలిస్తున్నారు. అయితే ఎక్కువ శాతం పంచాయతీల్లోని కంపోస్ట్‌ షెడ్లలో వ్యర్థాలను వేరు చేసే పనులు మాత్రం జరగడం లేదు. కొన్ని గ్రామ పంచాయతీల్లో సేకరించిన చెత్తను ఊరు బయట డంప్‌ చేస్తున్నారు. కంపోస్టు షెడ్లలో చెత్తను వేరు చేయడం లేదు. మరికొన్నిచోట్ల డంప్‌ చేసిన చెత్తను నిప్పు అంటిస్తున్నారు. అంటుకున్న నిప్పుతో రోజుల తరబడి మంటలు, పొగలు వ్యాపిస్తున్నాయి. రోడ్ల వెంట పొగలు వ్యాపించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ఎరువుల తయారీ ఇలా:
గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేస్తారు. తడి చెత్తను డీ కంపోస్టు చేయడంతో రెండు రోజుల్లో పూర్తిగా కుళ్ళిపోతుంది. దీనిని సెగ్రిగేషన్‌ ఉన్న బెడ్‌ పై వేయడంతో అప్పటికే బెడ్‌ లో ఉన్న వానపాములు చెత్తను సేంద్రియ ఎరువుగా మారుస్తాయి. ఇలా తయారుచేసిన సేంద్రియ ఎరువులను రైతులకు విక్రయించి వచ్చిన ఆదాయాన్ని గ్రామపంచాయతీకి ఉపయోగిస్తారు. ఇక్కడ సెగ్రిగేషన్‌ షెడ్లను అధికారులు పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి సెగ్రిగేషన్‌ షెడ్లను ఉపయోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం:
మండలంలో ఎరువుల తయారీ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. తడి, పొడి చెత్త వేరు చేయాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ డంప్‌ చేయవద్దని పంచాయతీ సిబ్బందికి సూచిస్తున్నాము. కంపోస్ట్‌ షెడ్లను వినియోగంలోకి తీసుకువచ్చి వాటి ద్వారా వచ్చిన ఎరువును గ్రామపంచాయతీ నర్సరీలలో మొక్కలకు వినియోగిస్తాము.
– వీరయ్య ఎంపీఓ పాలకవీడు

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌ దమ్మాయిగూడ

విచ్చలవిడిగా మున్సిపల్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు చీర్యాల్‌లో ఫామ్‌ హౌస్‌ నిర్మాణానికి మున్సిపల్‌ అధికారి అండదండలు అటువైపు కన్నెత్తి చూడని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మేడ్చల్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS