Wednesday, March 19, 2025
spot_img

రాజీవ్ యువ వికాసం పథకం ఒక వరం

Must Read
  • నియోజకవర్గంలో సుమారు 5వేల మంది నిరుద్యోగులకు ఉపాధి
  • షాద్ నగర్ ఆర్టీసీ డిపోకు మరో 18 కొత్త బస్సులు
  • మీడియాతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

గత ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కో హామీని ప్రభుత్వం చిత్తశుద్ధిగా నెరవేరుస్తూ వస్తోందని ఆరు హామీల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరో రాజు యువ వికాసం పథకాన్ని ప్రారంభించారని షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” తెలిపారు. మంగళ వారం నాడు.. షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ కప్పు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం వల్ల యువతకు ఉపాధి మార్గాలు పెరిగాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కోసం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి రూ. 6 వేల కోట్ల రాయితీ రుణాలు మంజూరు చేయనున్నారు. ఒక్కో లబ్దిదారుడికి రూ. 4 లక్షల వరకు రుణం మంజూరు చేయనున్నారని 60 నుంచి 80 శాతం వరకు రాయితీతో ఈ రుణాలు మంజూరు చేయనున్నారన్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన జరుగుతుందన్నారు. జూన్ 2వ తేదీన రాయితీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుందన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో దాదాపు 5000 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు.

షాద్ నగర్ కు మరో 18 బస్సులు
షాద్ నగర్ కు మరో 18 కొత్త బస్సులు తీసుకొస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం సందర్భంగా ఆయన విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా 18 బస్సులు వచ్చాయని ఇప్పుడు మరోసారి ప్రభుత్వం తన వినతిని స్వీకరించి మరో 18 బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం ఇవ్వబోతున్నట్లు శంకర్ స్పష్టం చేశారు. షాద్ నగర్ ఆర్టీసీ డిపోలో కొంత సిబ్బంది కొరత ఉందని దీనిని కూడా అధిగమిస్తామని ఆయన తెలిపారు. ప్రజలకు రమణా సౌకర్యం మెరుగుపరచడానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ఈ ప్రాంతంలో రవాణా మార్గాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జంగా నరసింహా యాదవ్, చలివేంద్రం పల్లి రాజు, హరినాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కే చెన్నయ్య, మున్సిపల్ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి, ఓబిసి చైర్మన్ చంద్రశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు గండ్రతి బాలరాజు గౌడ్, రఘునాయక్, అగనూరు బస్వం, అనసూయ, నుశ్రత్ బేగం, సయ్యద్ ఖదీర్, ముబారక్, జంగారి రవి, నలమోని శ్రీధర్, కర్రోళ్ళ సురేందర్, శ్రీహరి గౌడ్, లింగారెడ్డిగూడెం అశోక్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Latest News

అమరావతికి అంతర్జాతీయ సంస్థల రుణాలు

రైల్వే ప్రాజెక్ట్‌ ఖర్చు కేంద్రమే భరిస్తుంది శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS