ప్రధాని నరేంద్ర మోదీని ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా మర్యాదపూర్వకంగా కలిశారు. సంబంధిత ఫొటోలను మ్యూజిక్ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మోదీజీతో ఎప్పటికీ మర్చిపోలేని సమావేశమిది. నా ’సింఫొనీ- వాలియంట్’ సహా పలు అంశాలపై చర్చించాం. ఆయన ప్రశంసలు, మద్దతుకు కృతజ్ఞుడినని పేర్కొన్నారు. లండన్‌లో ఇటీవల ఇళయరాజా ’వాలియంట్’ పేరిట మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. లండన్‌లో వెస్టన్ర్ క్లాసికల్ సింఫొనీ నిర్వహించిన తొలి ఆసియా మ్యూజిక్ కంపోజర్‌గా ఇళయరాజా రికార్డు సృష్టించారు. కొన్ని రోజుల క్రితం చెన్నై తిరిగొచ్చిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగీతానికి వయసుతో సంబంధంలేదన్నారు. భవిష్యత్తులో.. 13 దేశాల్లో ’వాలియంట్’ నిర్వహించనున్నారు.


