- పద్దులు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
- తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు
- రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు
- మూల వ్యయం రూ.36,504 కోట్లు
2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా ఉంది. మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. అన్ని సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు సాగింది. రాష్ట్రంలో రైతులకే కాకుండా ఇతర రంగాల వారికి కూడా అధిక బడ్జెట్‌ను కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన ప్రసంగంలో వెల్లడించారు.
ఏ రంగానికి ఎంత బడ్జెట్
రెవెన్యూ విభాగంలో 10,954 గ్రామస్థాయి పోస్టులు
జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీప్రక్రియ మొదలు
20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేడెట్ స్కూల్స్
హాస్టళ్లలో డైట్ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్ చార్జీలు 200 శాతం పెంపు
ఎకరానికి రైతుభరోసా రూ.12వేలు
రైతు భరోసా: రూ. 18,000 కోట్లు.
వ్యవసాయ రంగానికి : రూ.24,439 కోట్లు
రైతుకూలీ సంక్షేమానికి ఇందిరమ్మ ఆత్మీయభరోసా కింద రూ.12వేలు
సన్నవడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నాం
ఆయిల్‌పామ్ సాగు పెంచేందుకు సబ్సిడీలు
త్వరలో 14,236 అంగన్‌వాడీల పోస్టుల భర్తీ
గృహజ్యోతి పథకంతో 50 లక్షల కుటుంబాలకు లబ్ధి
రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
నియోజకవర్గానికి కనీసం 3500 ఇళ్ల నిర్మాణం
ఆనుకుని హైదరాబాద్ నాలుగువైపులా శాటిలైట్ టౌన్‌షిప్‌లు
రూ.2 లక్షలలోపు రైతురుణాలు మాఫీ చేశాం
25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్లు మాఫీ
క్రీడలు రూ.465 కోట్లు
అడవులు.. పర్యావరణం రూ.1023 కోట్లు
దేవదాయ శాఖ రూ.190 కోట్లు
హోంశాఖ రూ.10,188 కోట్లు
చేనేత రూ.371 కోట్లు
మైనారిటీ సంక్షేమం రూ.3591 కోట్లు
పరిశ్రమల శాఖ రూ.3527 కోట్లు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూ.774 కోట్లు
విద్యుత్ శాఖ రూ.21,221 కోట్లు
వైద్యం, ఆరోగ్యం రూ.12,393 కోట్లు
మున్సిపల్ పట్టణాభివృద్ధి 17,677 కోట్లు
నీటి పారుదల శాఖ రూ. 23,373 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ రూ. 5907 కోట్లు
పర్యాటక శాఖ రూ.775 కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం రూ.11,405 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ. 31605 కోట్లు
మహిళా శిశుసంక్షేమం రూ.2862 కోట్లు
పశుసంవర్థక శాఖ రూ.1674 కోట్లు
పౌరసరఫరాల శాఖ రూ.5734 కోట్లు
విద్యాశాఖ రూ.23,108 కోట్లు
మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది.. కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది
బీఆర్‌ఎస్ పాలనలో ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించింది: భట్టి
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు. మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు భట్టి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా.. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాలల్లో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంతో సఫలీకృతమయ్యామన్నారు. అంబేద్కర్ సూచనలను అనుసరిస్తూ ప్రజాపాలన చేస్తున్నామన్నారు. అధికారాన్ని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో విధ్వంస పాలన సాగిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై నిరాధార విమర్శలు చేస్తున్నారన్నారు. సొంత మీడియాలో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు. సమ్మిళిత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నామని మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వరి బోనస్ కింద రూ.1,206 కోట్లు చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు రూ.12,511 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. త్వరలో 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని. విద్యావ్యవస్థ బలోపేతానికి యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని తీసుకొస్తున్నామన్నారు. 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని.. కులమతాలతో సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ సూళ్లలో బోధన ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉండనున్నట్లు తెలిపారు. ప్రతి సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ పథకం అమలులోకి తీసుకొస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం రూ.11,600 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి భట్టి వెల్లడించారు.