- రైల్వే ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రమే భరిస్తుంది
- శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని, రాజధాని అమరావతికి కేంద్ర సాయంపై శాసనమండలిలో మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.. ఈ నిధుల్లో గ్రాంట్ ఎంత… రుణం ఎంత అనేది చర్చించి చెబుతాం అన్నారు. హడ్కో ద్వారా 11 వేల కోట్లు రుణం తీసుకుంటున్నాం. జర్మన్ బ్యాంక్ ఒక 5000 కోట్లు లోన్ ఇస్తుంది. మొత్తం 31 వేల కోట్లు అమరావతికి వివిధ రూపాల్లో వస్తున్నాయని వెల్లడించారు. అమరావతికి రైల్వే ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రమే భరిస్తుందన్నారు.. ఇక, అమరావతి రైల్వే ప్రాజెక్ట్ కు అవసరమైన భూమిని ఎలా సేకరించాలనే దానిపై చర్చిస్తున్నాం. అమరావతి డిజైన్ చేసినప్పుడే స్వయం సమృద్ధి గా డిజైన్ చేశారని తెలిపారు.. ప్రస్తుతం పనులు ప్రారంభించడానికి బడ్జెట్ లో 6000 కోట్లు కేటాయించామని మంత్రి నారాయణ తెలిపారు.. ప్రజలు టాక్స్‌ల రూపంలో చెల్లించిన డబ్బులు అమరావతికి వాడకూడదనేది సీఎం నారా చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ గా చెప్పారని పేర్కొన్నారు.. రాజధాని కోసం తీసుకున్న రుణాలను అమరావతి పూర్తయిన తర్వాత అక్కడి భూములతో రీ పేమెంట్ చేస్తాం అన్నారు నారాయణ.. బ్యాంకుల ద్వారా డబ్బులు రావడానికి లేట్ అవుతుందని.. దీంతో, ఈ బడ్జెట్‌లో కేటాయించిన 6000 కోట్లతో పనులు ప్రారంభిస్తాం అని తెలిపారు.. అయితే, రుణాల ద్వారా డబ్బులు వచ్చిన తర్వాత బడ్జెట్ డబ్బులు క్లియర్ చేయనున్నట్టు శాసనమండలిలలో మంత్రి పొంగూరు నారాయణ వెల్లడిరచారు..