Saturday, March 29, 2025
spot_img

రాజస్థాన్‌ పై ఇసాన్‌ కిషన్‌ సెంచరీ

Must Read

జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు

పలు కారణాలతో కొన్నాళ్లుగా టీమిండియాకు ఇషాన్‌ కిషన్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ 2025లో తన తొలి మ్యాచులోనే సెంచరీతో అదరగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌ లో కీలక ఆటగాడిగా ఉన్న అతను ఆ జట్టు రిటైన్‌ చేసుకోకపోవడం వల్ల ఐపీఎల్‌ మెగా వేలంలోకి వచ్చాడు. వేలంలో ఇసాన్‌ కిషన్‌ ను హైదరాబాద్‌ 11.25కోట్లకు కొనుగోలు చేసింది. ఈ భారీ ధరకు న్యాయం చేస్తూ తొలి మ్యాచులోనే సెంచరీ చేశాడు. ఈ సూపర్‌ ఇన్నింగ్స్‌ తో ఇషాన్‌ ను మళ్లీ టిమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. టీమిండియా తరపున చివరగా 2023 నవంబర్‌ లో ఆడిన ఇషాన్‌ కిషన్‌ ఆ తర్వాత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. కొన్నేళ్ళ క్రితం వరకు వన్డేలు, టీ20ల్లో భారత జట్టులో కీలకంగా వ్యవహరించాడు. వికెట్‌ కీపర్‌ గా, బ్యాటర్‌ గా రాణించాడు. వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన అతికొద్ది మంది బ్యాటర్లలో ఇసాన్‌ కూడా ఒకరు. జాతీయ జట్టుకు ఆడనప్పుడు దేశవాళీలో ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ మాటలను ఇషాన్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో అతన్ని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి బీసీసీఐ తప్పించింది. దీంతో 2024లో ఇషాన్‌ ఐపీఎల్‌ లో ఆడాడు ఆ తర్వాత వెనక్కి తగ్గిన కిషన్‌ దేశవాళీ క్రికెట్‌ ఆడాడు. బుచ్చిబాబు టోర్నీలోనూ రాణించాడు. దీంతో దులీప్‌ ట్రోఫీలోనూ చోటు దక్కింది. ఇండియా సి తరుపున 126 బంతుల్లో 111 పరుగులు చేసి జాతీయ జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సెలక్టర్లకు సందేశం ఇచ్చాడు. తర్వాత రంజీ ట్రోఫీలో రaార?ండ్‌ కు కెప్టెన్సీ వహించి సెంచరీతో అదరగొట్టాడు. విజయ్‌ హాజారే ట్రోఫీలో సెంచరీ చేశాడు. ఇప్పుడు ఐపీఎల్‌ లోనూ మెరుపు సెంచరీతో అలరించాడు. ఈ మెగా టోర్నీలో మునుముందు ఇదే జోరు కొనసాగిస్తే మళ్లీ ఇషాన్‌ జాతీయ జట్టులోకి రావడం ఖాయమని క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS