Wednesday, April 2, 2025
spot_img

దివిస్‌కు ఒక న్యాయం.. వినీత్‌కి మరో న్యాయమా ..?

Must Read
  • ఫిర్యాదులను పిసిబి అధికారులు పట్టించుకోరా ?
  • దివిస్ కాలుష్యంపై ఐదేండ్లుగా పోరాడుతున్న గ్రామస్తులు
  • ప్రేక్షపాత్ర వహిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్న అధికారులు
  • పిసిబి పిర్యాదులు, వ్యవహారాలపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
  • అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను డిస్మిస్ చేయాలి
  • యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు, గీత కార్మికులు, పర్యావరణ కార్యకర్తల డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని దివిస్ ల్యాబ్స్ కాలుష్యంపై గత ఐదు సంవత్సరాలుగా రైతులు, గీత కార్మికులు, పర్యావరణ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు.. వీరు ఇక్కడి కాలుష్యానికి సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు లెక్కకు మించి పిర్యాదులు చేసినప్పటికీ పిసిబి అధికారులు గాని ప్రభుత్వం ద్రుష్టిసారించకపోవడం నిజంగా అమానుషమని చెప్పాలి.. ప్రభుత్వం, అధికారుల వైఫల్యాలను తట్టుకోలేని రైతులు, గీత కార్మికులు, పర్యావరణ కార్యకర్తలు, గ్రామస్తులు న్యాయస్థానాలలో కేసులు వేయడం జరిగింది . ఈ కేసులపై అధికారులు తప్పుడు నివేదికలను తయారుచేసి దివిస్ ల్యాబ్స్ కు అనుకూలంగా నివేదికలు తయారు చేసి కోర్టులను తప్పుదోవ పట్టించడం ఆనవాయితీగా మారిపోయింది..

గత ఐదు సంవత్సరాలుగా దివీస్ ల్యాబ్స్ పై స్థానికులు ఫిర్యాదులు చేసినప్పుడల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కంటి తుడుపు చర్యగా టాస్క్ ఫోర్సు మీటింగుకు పిలిచి ఎలాంటి చర్యలు చేపట్టకుండానే కేవలం సూచనలు జారీ చేసి దివిస్ ల్యాబ్స్ కు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కొమ్ము కాస్తున్నారు.. ఇటీవల నల్లగొండ ప్రాంతీయ కార్యాలయం అధికారులు దివిస్ ల్యాబ్ యజమాన్యంతో కుమ్మక్కై ఏకపక్షంగా దివిస్ కు అనుకూలంగా ఇచ్చిన నివేదికను కోర్టు కొట్టివేయడం జరిగింది..

దివిస్ ల్యాబ్స్ కు ఒక న్యాయం.. వినీత్ ల్యాబ్స్ కి మరో న్యాయమా ..?
ఇదే జిల్లాలోని ఇదే మండలంలోని మల్కాపూర్ గ్రామ పరిధిలో గల వినీత్ ల్యాబ్స్ కాలుష్యం పై రైతులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో వినీత్ ల్యాబ్స్ లో ఉత్పత్తుల నిలిపివేతకు పిసిబి అధికారులు క్షణాల్లో ఆదేశాలు జారీ చేశారు.. బ్యాంకు గ్యారంటీలు కూడా జప్తు చేశారు.. రైతులు తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ దివిస్ ల్యాబ్స్ కు, వినీత్ ల్యాబ్స్ కు కోర్టు ద్వారా నోటీసులు పంపడం జరిగింది.. వచ్చిన ఫిర్యాదుల మేరకు న్యాయస్థానం, రైతుల పక్షాన నిలబడి న్యాయం చేయాలనీ అధికారులను ఆదేశించింది.. దీంతో పిసిబి అధికారులు టాస్క్ ఫోర్స్ మీటింగు పెట్టి వినీత్ లాబ్స్ కు ఉత్పత్తుల నిలిపివేతకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.. వినీత్ ల్యాబ్స్ నుంచి రైతలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టిన అధికారులు.. గత ఐదేండ్లుగా అలుపెరుగని పోరాటం జరుపుతున్న దివిస్ ల్యాబ్స్ జోలికి పోవడంలేదు.. ఇక్కడే రైతులు అధికారులను నిలదీస్తున్నారు.. దివిస్ ల్యాబ్స్ కు ఒక న్యాయం.. వినీత్ ల్యాబ్స్ కి మరో న్యాయమా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. ప్రజాప్రయోజనాలను దెబ్బతీస్తూ పర్యావరణ చట్టాలను నిలువునా పాతర వేస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.. దివిస్ యజమాన్యానికి సహకరించిన అధికారులపై వచ్చిన పిర్యాధులపై దివీస్ కాలుష్యం ప్రభావిత గ్రామాలలో బహిరంగ విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలనీ వారు కోరుతున్నారు..

ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమపై చర్యలెందుకు తీసుకోరు..?
ఆర్.సి పురం ప్రాంతీయ కార్యాలయ పరిధిలోని ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమ ఉత్పత్తుల కారణంగా ఇక్కడి రైతులతోపాటు ఫారెస్ట్ విభాగానికి చెందిన చెట్లు కాలుష్యం బారిన పడి తీవ్రంగా నష్టం వాటిల్లుతుంది.. అందుకు సంబంధించి గత ఎనిమిది నెలల క్రితం పిసిబి అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు నివారణ చర్యలు చేపట్టకుండా ప్రేక్షకపాత్ర వహించడంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమపై చర్యలు చేపట్టాలని కోరుతూ గ్రామస్తులు పెద్ద ఎత్తున మెదక్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి కలెక్టర్ కు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.. పైగా ఫిర్యాదుల నేపథ్యంలో బాధితులను ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ కు సంబంధించి నిర్వాహకులను పిలిపించి వివరణ కోరవలసి ఉండగా అధికారులు దేనికి విరుద్ధంగా నేటికీ టాస్క్ ఫోర్స్ మీటింగుకు పిలిచి వివరణ కోరలేదు.. దీనిపై కూడా రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..

మెంబర్ సెక్రెటరీ బంధువునని చెప్పుకుంటూ ఓ అధికారి ఆక్రమాలకు తెర :-
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ బంధువని ఓ అధికారి అక్రమాలకు తెరదీశారు.. తనీకీల పేరుతొ ఆ అధికారి నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవడం జిల్లాలో చర్చనీయాంశమయింది.. ఉన్నతాధికారి బంధువు కావడంతో కింది స్థాయి ఉద్యోగులు ఎవరు ఈ అంశాన్ని పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.. తన పరిధికాని అంశాల లోకి వెళ్లడం వాటిని పరిశీలన పేరుతొ యజమాయిషి చేయడం ఉద్యోగులకు పూర్తిగా నచ్చడం లేదట.. ఈ ఉద్యోగి వ్యవహారాలను కింది స్థాయి ఉద్యోగులు ఆఫ్ ది రికార్డు పరిష్కారిస్తే బాగుంటుందని కోరుకుకుంటున్నారు..

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS