Tuesday, April 1, 2025
spot_img

పదో తరగతి పేపర్‌ లీకేజీపై విద్యార్థి పిటిషన్‌

Must Read

వచ్చేనెల 7న కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశం

నకిరేకల్‌ టెన్త్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో విద్యార్థిని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తన డిబార్‌ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సెక్రెటరీ, నల్గొండ డీఈవో, ఎంఈవో, నకిరేకల్‌ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్‌లను ప్రతివాదులుగా విద్యార్థిని పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్‌ 7న కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా నల్గొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన విద్యార్థిని టెన్త్‌ పేపర్‌ లీకేజీలో వ్యవహారంలో డిబార్‌ అయింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పదవ తరగతి పరీక్ష పేపర్‌ లీకేజీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి నకిరేకల్‌ పోలీస్‌స్టేసన్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. పది పరీక్షలో మాస్‌ కాపీయింగ్‌ నిందితులతో మున్సిపల్‌ చైర్మన్‌కు సంబంధాలు ఉన్నాయంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశా రు. దీంతో కేటీఆర్‌ ట్వీట్‌పై నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రజిత, శ్రీనివాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌పై నకిరేకల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్‌పై నకిరేకల్‌ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. కాంగ్రెస్‌ నాయకుడు ఉగ్గడి శ్రీనివాస్‌ కూడా సోషల్‌ మీడియాపై ఫిర్యాదు చేశారు.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS