Wednesday, April 16, 2025
spot_img

సత్య సాయి మార్గం ప్రపంచ మానవాళికి రక్షణ

Must Read

శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్. జె. రత్నాకర్ పిలుపు

సత్యం, ధర్మం, శాంతి ప్రేమల ద్వారా మానవ విలువలను పెంపొందించేందుకు, సత్య సాయి చూపిన మార్గమును ఆచరించినప్పుడే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి రక్షణ ఉంటుందని, ఈ తరుణంలో ప్రతి ఒక్కరు సత్యసాయి చూపిన బాటలో నడిచినప్పుడు మాత్రమే అట్టి బాట చూపిన వారి వెంట ఉంటారని, ప్రతి ఒక్కరూ సత్యసాయి మార్గాలను అలవర్చుకోవాలని సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఆర్.జె రత్నాకర్ అన్నారు. ఏప్రిల్ 5, 6, 7 తేదీలలో పుట్టపర్తి నందు యువజన పత్తియాత్రను నిర్వహించారు. యాత్ర చివరి రోజు అయిన ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్. రత్నాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ, నేడు ప్రస్తుత మానవుని జీవన వివాహ శైలిలో మానవతా విలువలు కొరవడి అనేక అగైత్యాలు జరుగుచున్నాయని వీటిని సంపూర్ణంగా నిర్మూలించడానికి ఆధ్యాత్మికత ఏకైక మార్గమని, ఈ క్రమంలో శ్రీ సత్య సాయి నువ్వు సూచించిన మార్గాలను నేటి యువత అలవర్చుకోవాలని ఇతరులకు పంచాలని ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి రోజురోజుకు సత్యసాయి సమితులు, మండలిలు ప్రారంభమవుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలలో సత్య సేవ సమితులు ప్రారంభమై ఆయన చూపిన మార్గాలను అనుసరిస్తున్నాయని, ముఖ్యంగా అమెరికా దేశంలో మహిళా విభాగాలు ప్రారంభమవుతున్నాయని, 70 శాతం మహిళలు సాయి శాఖలను నడపడం వారి భక్తికి నిదర్శనం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా దేశాలు కూడా సత్య సాయి సేవా కార్యక్రమల పట్ల ఆసక్తి చూపుతున్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువతి యువకులు ఈ యాత్రలో పాలుపంచుకోవడం ఎంతో శుభ పరిణామం అన్నారు. యాత్ర ప్రారంభం మొదటి రోజైన శనివారం రోజున సత్యసాయి శోభాయాత్ర పుట్టపర్తి లో గతంలో కని విని ఎరుగని రీతిలో జరపడం పుట్టపర్తి పట్టణంలో చర్చనీ చర్చనీయమైన అంశమైందన్నారు. సత్య సాయి ప్రాంతానికి చెందిన ఒక యువకుడు తనకు లండన్ లో ఉద్యోగం వచ్చిందని ఫేస్ బుక్కులో పెడితే, అది చూసిన సత్యసాయి భక్తులు ఆ యువకుడికి అన్ని రకాలుగా ప్రోత్సహించి, తమ సహాయ సహకారాలను అందివ్వటం సాయి పట్ల భక్తి దీనికి నిదర్శనం అన్నారు. నేటి యువత ప్రతిరోజు ఉదయమే ఐదు గంటలకు లేచి సాయిస్మరణతో తమ కార్యక్రమాలను కొనసాగించినట్లయితే, వారి వెంట అన్ని రకాలుగా సాయి ముందుండి నడుపుతాడని రత్నాకర్ అన్నారు. సత్యసాయి కి ప్రచారం కాదు ఆచారం కావాలి అనే సూక్తిని ప్రతి ఒక్కరు ముందుండి ఆచరించాలన్నారు. ఈ పర్తియాత్రలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది యువతి యువకులు పాల్గొనగా, జిల్లాల వారీగా సాయి సేవ బాధ్యులకు మెమొంటోలను శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ ఆర్. జె రత్నాకర్ అందజేశారు.

Latest News

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌కు 1278 నామినేషన్లు

వ్యక్తిగత క్యాటగిరిలో 1172 నామినేషన్స్‌ చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 నామినేషన్స్‌ ఈ నెల 21 నుండి స్క్రీనింగ్‌ చేయనున్న జ్యూరీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS