ఉదయం 7 నుంచి అటవీ ప్రాంతంలో అనుమతి
చుట్టూ అడవి.. కొండలు.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు. అలాంటి సలేశ్వరం జాతర ఉత్సవాలు శుక్రవారము నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నెల11 నుంచి 13 వరకు జాతర ఉత్సవాలు జరుగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమతి ఇవ్వనున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. ఉత్సవాలకు సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు వివిధ రాష్ట్రాల నుండి లింగమయ్య స్వామివార్లను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నది. సలేశ్వరం వెళ్లే దారిలో చెంచు గుడారాల విూదుగా దట్టమైన అడవి మధ్య నుంచి రాళ్లు, రప్పలు, లోయలలోదిగి వెళ్లాల్సి ఉంటు-ంది. అక్కడికి వెళ్లడానికి వాహనాల సౌకర్యం ఉండదు. ఇది శ్రీశైలం అడవులలోని ఒక ఆదిమవాసి యాత్ర స్థలము. ఇక్కడ ప్రతి ఏడాది ఒకసారి మాత్రమే జాతరజరుగుతోంది. ఈ జాతర ఉగాది వెళ్లిత తర్వాత తొలిచైత్ర పౌర్ణమికి మొదలౌతుంది. శ్రీశైలనికి 60కిలో విూటర్ల దూరంలో ఉంటుంది. అడవిలో నుంచి ఫరహబాద్ విూదుగా 30 కిలో విూటర్ల వరకువాహన ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో 30 కిలో విూటర్లు వాహన ప్రయాణం, అక్కడి నుంచి 5 కిలో విూటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో ఉన్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు, భక్తులు అందరు ముగ్ధులుఅవుతారు.
ఇది నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవులలో ఉంది. శ్రీ శైలం – హైదరాబాద్ వెళ్లే రహదారిలో శ్రీశైలం అటవీప్రాంతంలో శ్రీశైలం దారినుండి పక్కదారిలో ఫరహబాద్ పులిబొమ్మ నుండిలోపలికి వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుండి వచ్చేవారు 130 కి.విూ. ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రం నుండి వచ్చేవారు 100 కి.విూ, నల్లగొండ జిల్లా నుండి వచ్చే వారు 150 కి.విూ దూరం ప్రయాణం చేసిన తర్వాత మన్ననూర్ గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుండి శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి విూదుగా మన్ననూర్ నుండి 15 కి.విూ దూరంలో ఉన్నఫరహాబాద్ చౌరస్తాకు చేరుకోవాలి. అక్కడి నుంచి పూర్తిగా దట్టమైన అటవీమార్గన సుమారు 30 కిలో విూటర్ల దూరంలో దట్టమైన అడవిప్రాంతంలో రాంపూర్పెంటకు చేరుకోవాలి. అక్కడి నుండి మరో 2 కి.విూ. దూరం ఆటోల ద్వారా వెళ్లే ప్రధాన మార్గం వద్దకు చేరుకోవాలి. అక్కడినుండి మరో 3 కి.విూ దూరం కాలినడకన కొండలు, గుట్టలు దాటు-కుంటూ సలేశ్వరం గుడివద్దకు సాహాసయాత్ర చేయాల్సి ఉంటు-ంది. రెండో మార్గం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అప్పాయిపల్లి గ్రామం విూదుగా కాలినడకనతో పాటు- ట్రాక్టర్ల ద్వారా కొండలు, గుట్టల నుండి సాహసంగా సలేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది. ఫరహాబాద్ నుండి పదికిలోవిూటర్ల దూరం వెళ్లగానే రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం కనబడుతుంది. నల్లమల అటవీప్రాంతం, వన్యప్రాణులను సంరక్షణకు సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ అధికారులు అన్నారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్లు మాత్రమే రాగలరు. ఈ నెల 11, 12, 13 వరకు మూడు రోజులపాటు సలేశ్వరం జాతరకు అనుమతి ఉంటుంది. చెంచుల ఆచార వ్యవహారాల ప్రకారం జాతరలు నిర్వహించుకునేందుకు ఆటవీశాఖ ఆటంకం కల్గించదు. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసరప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించాంరు.