Saturday, October 4, 2025
spot_img

గోశాల గోవుల మృతి ఆరోపణలు సత్యదూరం

Must Read

అత్య ప్రచారాలుగా కొట్టి పారేసిన టిటిడి

గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని టిటిడి ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మృతి చెందిన గోవుల ఫొటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఫొటోలు అసలు గోశాలకు సంబంధించినవి కావు, దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవుల ఫొటోలను టిటిడి గోశాలలో మృతి చెందినవిగా చూపించి.. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారం అని కొట్టిపారేసింది.. గోవులు చనిపోయా యంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన టిటిడి, ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.. టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే ఈ ప్రకటన విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంనకు చెందిన గోశాలలో గోవులు మృతిచెందాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై టిటిడి మాజీ చైర్మన్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. ఆరోపణలు గుప్పించారు.. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో వందకు పైగా గోవులు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. స్వీ గోశాలలో గత మూడు నెలలుగా వందకుపైగా ఆవులు చనిపోతున్నా.. పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.. అయితే, ఎస్వీ గోశాలలో గోవులు మృతిచెందాయంటూ జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని కొట్టిపారేసింది..

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This