అన్య దేశాలు వాళ్ళ భాష గొప్పదనాన్ని చాటిజెప్తు మాతృభాషకు న్యాయం జేస్తే, మనోళ్లు మాత్రం భాషనే లేకుండా జేస్తమంటారు. దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు వారి పలుకులు ఏడవాయనో. ఎవళ్ళ మాతృభాషకై వాళ్లు కృషి జేస్తుంటే మనం మాత్రం మన భాషను కనుమరుగు జేస్తున్నం. వ్యవహారిక భాషోద్యమానికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి ఆశయాలను అణగదొక్కుతు, అర్థమయ్యే భాషను తీసేసి రాని భాషకై పాకులాడుతుండ్రు.. తెలుగు భాషనే లేకుండా జేస్తమనే వీళ్ళ ఆలోచనేందో, ఎంతేత్తుకెదిగిన అమ్మను, అమ్మ భాషను మరవద్దనే సంగతిని మరుస్తున్నరుగ.. ఓ రాజ్యమా ఇగనైనా మాతృభాషకు ఊపిరి పోయండి.. కానీ ఉరి తీయకండి…
- కాల్వ నిఖిత, 6309767894