- టీజీపీఎస్సీ తాటాకు చప్పుళ్ళకు భయపడం
- సమాధానం చెప్పకుండా పరువు నష్టం దావా నోటీసులా
- టీజీపీఎస్సీ తెలంగాణ కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగమా ?
- టీజీపీఎస్సీ నోటీసుల పై మండిపడ్డ రాకేష్ రెడ్డి
గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో అవతవకలు జరిగినట్లు పూర్తి అధారాలతో తాను చెబితే వాటికి సమాధానం చెప్పకుండా టీజీపీఎస్సీ తనకు పరువు నష్టం దావా నోటీసులు పంపడం దుర్మార్గం అని బీఆర్ ఎస్ నేత రాకేష్ రెడ్డి అన్నారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడుతూ టీజీపీఎస్సీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గా మారిందనే అనుమానాలు కలుగుతున్నాయని కాని టీజీపీఎస్సీ తాటాకు చప్పుళ్లకు, ఉడుత ఊపులకు మేమెవ్వరం భయపడమని స్పష్టం చేశారు. మా భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు టీజీపీఎస్సీకి ఎక్కడిదని నిలదీశారు. ఓ వ్యక్తి మీద వ్యవస్థ ను ఉసిగొల్పుతారా, అంటే మీరు చేసిన తపులను నేను ప్రశ్నించడమే నేరమైతే ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు. టీజీపీఎస్సీ తెలంగాణ కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగమా అంటూ వ్యాఖ్యానించారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా టీజీపీఎస్సీ తీరును తప్పుపట్టలేదా అని నిలదీశారు. టీజీపీఎస్సీ తీరుపై ఆ సంస్థ వెబ్సైట్ కు అనేక పిర్యాదులు వచ్చాయని, వాళ్లకు కూడా నోటీసులు పంపుతారా అంటూ నిలదీశారు. వార్తాపత్రికలు కూడా అనేక కథనాలు రాశాయయని మరి వాటికి కూడా నోటీసులు పంపుతారా అటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నేను మాట్లాడితేనే మీ పరువు పోయిందా, పరువు తీసుకునే పనులను టీజీపీఎస్సీ చేసుకుంటూ పోయి ఇపుడు ప్రశ్నిస్తే మమ్మల్ని అంటే ఎలా అంటూ నిలదీశారు. నేను ఇప్పటికీ కూడా చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, క్షమాపణ చెప్పేది లేదు, టీజీపీఎస్సి యే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు వేర్వేరు హల్ టికెట్ లు ఇవ్వడం కరెక్టా, లేదా 563 మంది ర్యాంకర్ల లో టాప్ 500 మందిలో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి లేరనడం తప్పా అని అడిగారు. నేను డబ్బులు సంపాదించుకోవడానికి ఈ ఆరోపణలు చేసినట్టు రాజ్యాంగ బద్ద సంస్థ ఆయిన టీజీపీఎస్సీ నోటీసు లో పేర్కొన వచ్చా అంటూ విమర్శించారు. నా ప్రాథమిక హక్కులను హరించిన టీజీపీఎస్సీ పై నేను కూడా పరువు నష్టం దావా వేస్తానని అయన వెల్లడించారు. టీజీపీఎస్సీ చైర్మన్ గవర్నర్ కు భాద్యుడు, కాని అయన అందుకు విరుద్దంగా సీఎం ను కలిశారు, సీఎంను కలిసినపుడు బుర్రా వెంకటేశం మీద నేను ఎపుడైనా డబ్బుల ఆరోపణలు చేశానా అంటూ ప్రశ్నించారు. నా ఆరోపణల్లో సహేతుకత లేకుంటే విచారణ కమిషన్ వేయాల్సింది అపుడు కమిషన్ ముందు మొత్తం ఆధారాలు సమర్పిస్తామని అయన స్పష్టం చేశారు.