వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం మన్సాన్ పల్లి గ్రామానికి చెందిన యువతి బాక్సింగ్ లో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. 7వ యూత్ అండర్ 19 పురుషుల,మహిళల బాక్సింగ్ రాష్ట్ర స్థాయి ఎంపిక దాసడి విజయ్ బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లాలాపేట్ లోగల ప్రొఫెసర్ జయశంకర్ మున్సిపల్ స్టేడియంలో 11,12వ తేదీలలో జరిగాయి. అండర్ _19 మహిళల కేటగిరి 45_48 కేజీల విభాగంలో జిల్లాకు చెందిన ఎం.నిఖిత గోల్డ్ మెడల్ అందుకోవడం విశేషం. ఈ సందర్భంగా యువతీ తల్లిదండ్రులు దేవి బాయి విటల్ నాయక్ లతో పాటు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నార్సింగి లోని గిరిజన గురుకులంలో విద్యాభ్యాసం కొనసాగిస్తుంది.