గాలి దుమ్ముతో అకాల వర్షం రైతు నోట్లో మట్టి కొట్టినట్టు అయ్యింది అని ఆత్మకూరు (ఎస్) మండల రైతులు అన్నారు. ఆదివారం సాయంత్రం గాలితో కూడిన వర్షం వరి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. సోమవారం ముక్కుడుదేవుపల్లి, ఇస్తాలపురం, కొత్త తండా గ్రామాలకు చెందిన వరి రైతులకు వందల ఎకరాల్లో తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని రైతులు బోరుణ విలువిపించారు. వరి పంట చేతికొచ్చే సమయంలో ఎన్నడూ చూడని విధంగా గాలితో కూడిన వర్షాలు వచ్చాయని, వడ్లు నేలమట్టం అయ్యాయని మండల అధికారులకు ఫోన్ చేసినా కనీసం స్పందించలేదని, మాకు చావే శరణ్యం అంటూ బోరుణ వినిపించారు. జిల్లా కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, మాకు పంట నష్టం చేకూర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో భయ్యా నాగలింగం, ఇరుగు వెంకన్న, భయ్యా జ్యోతి, వీరబోయిన భవాని, భయ్యా లింగమల్లు, బొంత పాపులు, ఇరుగు లచ్చయ్య, బయో వెంకన్న, బయో గంగమ్మ, వీరబోయిన భవాని, కొమర మల్లు, బిల్స్ మల్లయ్య, బోలకబుచ్చాలు, వీరబోయిన మధుసూదన్, దాసరి అంజయ్య, సోమయ్య తదితరులు నిరసన వ్యక్తం చేశారు.