Wednesday, April 16, 2025
spot_img

పొత్తులో పంచాయతీ.. తేల్చేది లేదు.. కూల్చేది లేదు..

Must Read
  • మాకు సంబంధం లేదంటే, మాకు సంబంధం లేదంటున్న అధికారులు.
  • ఇరిగేషన్, రెవిన్యూ తర్జన భర్జన.
  • రావుస్ ఫార్మా లేబరేటరీస్ ప్రవేట్ లిమిటెడ్ పై నేటికి చర్యలు శూన్యం.
  • ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడంలో అధికారులకు బాధ్యత లేదా.?
  • హైడ్రాస్ఫూర్తితో అక్రమాలను సక్రమంగా మార్చలేరా.?
  • ఇది కూడా మీ విధుల్లో భాగమే కదా.?

కెనాల్ భూమిని కబ్జా చేసి ఫార్మా కంపెనీ అక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని కూల్చడానికి అధికారులు ఆపసోపాల పడుతున్నారు. మూడు సంవత్సరాల కాలంగా వార్తాకథనాలు వేస్తున్న ఉన్నాయి. జిల్లాకు సంబంధిత శాఖ అధికారులు వస్తూ వెళ్తూనే ఉన్నారు.నేటి కి కెనాల్ భూమిని కబ్జా చేసిన ఓ ఫార్మా కంపెనీ చేసిన అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవడానికి ఇరిగేషన్, రెవెన్యూ మండల, జిల్లా స్థాయి అధికారులు దోబుచులాటాడుతున్నారు. మీరు చర్యలు తీసుకోండి అంటే, మీరే చర్యలు తీసుకోండి అంటూ ఒకరి మీద ఒకరు తోసుకుంటు, ఉన్నత స్థాయి అధికారులకు వీలుపడతలేదంటూ ఫార్మా కంపెనీ పై చర్యలు తీసుకోకుండా అంత కలిసి నిర్లక్ష్యం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని రావుస్ ఫార్మా లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులు బిడిఎం కెనాల్ భూమిని ఆక్రమించుకున్నారని గతంలో గ్రామ కార్యదర్శి నోటీసులు అందించారు. ఆ తర్వాత రెవెన్యూ మండల కార్యాలయం నుండి నోటీస్ ఇచ్చారు. అందులో మూడు రోజుల్లోగా నిర్మాణం తొలగించకపోతే అక్రమ నిర్మాణాలపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఆ తర్వాత ఇరిగేషన్ కార్యాలయం నుండి కూడా ఫార్మా కంపెనీ నిర్వాహకులకు నోటీసులు అందించారు. ఇలా నోటీసుల పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారా తప్ప, కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

సారు కి సమయం కుదురుతలేదు
ఫార్మా కంపెనీ పై శాఖా పరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత శాఖ ల (రెవిన్యూ, ఇరిగేషన్) అధికారులకు కొన్ని నెలలుగా సమయం కుదుర్తలేదని చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎన్నో కథనాలు విలువడుతున్నప్పటికీ, ఆయా శాఖల అధికారులు వారి వారి ఉన్నతధికారులకు ఎస్సారెస్పీ కెనాల్ భూమిని పరిశీలించడానికి సమయం వీలుపడతలేదని కింది స్థాయి అధికారులు చెప్తున్నారు. స్థానికంగా ఉన్న గ్రామస్తులు మాత్రం, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణం చేపట్టిన ఫార్మా కంపెనీపై చర్యలు తీసుకోవడానికి అధికారులు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.గ్రామానికి చెందిన పలువురు గతంలో ఇదే ఫార్మా కంపెనీ పై అధికారులకు పిర్యాదులు కూడా చేశారు.

అధికారులపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు :
చివ్వెంల గ్రామ శివారులోని 544 సర్వే నెంబర్ లో బిడియం ఎస్సారెస్పీ కెనాల్ భూమిని కబ్జా చేసిన రావుస్ ఫార్మా లాబరేటరీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ పై, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సూర్యాపేట 18వ వార్డు, వస్త్రం తండా కు చెందిన ధారావత్ వెంకటేష్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కి ఫిర్యాదు చేశారు. మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన, సూర్యాపేట నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ కార్యనిర్వాక ఇంజనీర్ డివిజన్ వన్ అధికారికి ఫిర్యాదు చేసిన కూడా ఎవరు స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి హైడ్రాస్ఫూర్తితో ఎస్సారెస్పీ కెనాలు ఆక్రమించిన రావుస్ ఫార్మా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని కోరారు.

Latest News

రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

అనేకకార్యక్రమాలు అమలుచేసి చూపాం సిఎల్‌పి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS