- దరఖాస్తుకు ఏప్రిల్ 30 చివరి తేది
- 13నెలల శిక్షణ, రూ.16వేల స్టేఫండ్
- అధనంగా ప్రయాణ, ప్రాజెక్టు ఖర్చులు
డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఎస్‌బీఐ అద్బుత అవకాశాన్ని కల్పిస్తుంది. యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025 పేరుతో అసక్తి వున్న అభ్యర్తుల నుండి ఎస్‌బిఐ ఫౌండేషన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. 13 నెలల వరకు కొనసాగే ఈ ఫెలోషిప్ గ్రామీణ భారతదేశంలో సామాజిక మార్పును నడిపించే లక్ష్యంతో ఏర్పాటు చేసింది. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచడానికి అవకాశం ఉంటుందని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది అక్టోబరులోపు ఏదైనా డిగ్రీ కోర్టు పూర్తి చేసి ఉండాలని అలాగే అభ్యర్ధుల వయసు అక్టోబర్ 1, 2025వ తేదీ నాటికి 21 నుంచి 32 ఏళ్ల మద్యలో వున్న వారు ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నట్లు వెల్లడిరచారు. ఎంపికైన వారికి విద్య, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి వంటి కీలక సమస్యలను పరిష్కరించడానికి, గ్రామీణ భారతదేశాన్ని సాధికారపరచి యువతలో సామాజిక బాధ్యత స్ఫూర్తిని పెంపొందించేందుకు అవసరమైన నైపుణ్యాలపై 13 నెలల కాలంలో శిక్షణ ఇస్తారు. వీరంతా గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామీణ పరిస్థితులపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి వసతి కోసం నెలకు రూ.16 000 చొప్పున స్టైపెండ్‌తోపాటు, స్థానికంగా ప్రయాణ ఖర్చులకు మరో రూ.2000, ప్రాజెక్టు సంబంధిత ఖర్చుల కోసం నెలకు రూ.వెయ్యి చొప్పున చెల్లించనున్నారు. ఫెలోషిప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇతర అలవెన్సుల రూపంలో రూ.90 వేల వరకు అందజేస్తారు. మొత్తంగా శిక్షణ పూర్తి కాలంలో రూ.3,37,000 స్టైపెండ్ అందుకునే అవకాశం వుంది.