జగం మెచ్చిన నాయకుడు
జనం నచ్చిన నాయకుడు
భరత మాత పుత్రుడు
దళిత జాతి సూర్యుడు
బాబా అంబేద్కరుడు
మను చరిత్రపై దండయాత్ర
మరువని భారత చరిత్ర
సమ సమాజానికై సాగినయాత్ర
అంతులేని మీ సేవల గాథ
రాజ్యాంగ రచనకు రథసారధి
ఆదర్శాల నిర్మాణ వారధి
భారత భాగ్య విధాత
మా ఉజ్వల భవిష్యతు ప్రధాత
మీ ఆశయాలకై మా నిత్య గమనం
మీ స్ఫూర్తితో సాగుతాము నిశ్చయం
బహుజనులకు అంతులేని గౌరవం
భారతదేశ ఆత్మ గౌరవం
- బొల్లం బాలకృష్ణ