- భార్యత మృతి.. అడడ్డువచ్చిన అత్తకు తీవ్ర గాయాలు
- నిందితుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యా భర్తల మధ్య మధ్య చిచ్చుపెడుతున్నాయి. దీని కారణంగా చావడమో లేదా చంపడమో చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పటాన్ చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ భర్త భార్యపై విచక్షణా రహితంగా దాడి చేసి అంతమొందించాడు. అడ్డు వచ్చిన అత్తపై కూడా దాడికి పాల్పడ్డాడు. ప్రమీల(26) రమేష్ (32) ఇద్దరు భార్యాభర్తలు. కొంతకాలం వరకు సాఫీగానే సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. భార్యభర్తల మధ్య మనస్పర్థలతో గత కొంత కాలంగా భర్తకు దూరంగా వుంటుంది ప్రమీల. దీంతో ఆగ్రహానికి లోనైన భర్త రమేష్ భార్య ప్రమీలను రోకలిబండతో కొట్టి చంపాడు. అంతటితో ఆగకుండా అడ్డు వచ్చిన అత్త కవితపై దాడి చేశాడు. ఈ దాడిలో భార్య ప్రమీల అక్కడికక్కడే మృతిచెందింది. అత్త కవితకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్నారు స్థానిక సీఐ వినాయక్ రెడ్డి, సిబ్బంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన అత్త కవితను సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రమేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.