Saturday, April 19, 2025
spot_img

కొంగొత్తగా.. మైనార్టీ గురుకులాలు

Must Read
  • టీజీఎంఆర్ఈఐఎస్ లో మోర్ ఛేంజెస్
  • ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్
  • విద్యార్థుల సంక్షేమం కోసం వినూత్న చర్యలు
  • ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై వ్యక్తిగత పర్యవేక్షణ
  • సంస్థలోని సమస్యల పరిష్కారానికి కార్యాచరణ
  • పురోగతి శిఖరాలకు చేరువలో మైనార్టీ హాస్టల్స్
  • తఫ్సీర్ ఇక్బాల్ పర్యవేక్షణలో సూపర్బ్
  • ఐపీఎస్ ను తారీఫ్ చేస్తున్న విద్యార్థులు, పేరెంట్స్

‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుందని’ పెద్దలు చెబుతుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మన ప్రాంతం వెనుకబడిపోయింది. నిధులు, నియామకాలు ఆంధ్రోళ్లు ఎత్తుకుపోతున్నారంటూ ఎందరో మేధావులు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడారు. ఏపీ నుంచి తెలంగాణను వేరు చేయాలని పట్టుబట్టారు. కానీ, చివరకు అదీ జరిగినా వాళ్లు చూడకుండానే వెళ్లిపోయారు. రాష్ట్రం వచ్చి 11ఏళ్లు అయినంక ఇప్పుడూ కానొస్తుంది ప్రత్యేక తెలంగాణలో మనకెంతో మేలు జరుగుతుందో. మన, మన పిల్లల చదువు కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేసుకోవచ్చు. ఎంత పెద్ద ఉద్యోగాలు అయినా మన పిల్లలకే వస్తాయి. ఇప్పుడూ అదే జరుగుతుంది మారుమూల గ్రామం, ప్రాంతంలో పుట్టిన పేద, బడుగు బలహీన వర్గాల బిడ్డ అయినా సరే ఎలాంటి డబ్బు అవసరం లేకుండా ఉన్నత చదువులు చదవొచ్చు అని పాలకులు నిరూపిస్తున్నారు. అందుకనుగుణంగా అధికారులతో పనులు చేయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇండ్లల్లో పుట్టిన పిల్లలపై మరింత శ్రద్ద పెడుతున్నారు. అందులో భాగంగానే మైనార్టీ గురుకులాలు కొంగొత్తగా తయారవుతున్నాయి. ఐపీఎస్ ల చొర‌వ‌తో టీజీఎంఆర్ఈఐఎస్ లో మోర్ ఛేంజెస్ చేస్తున్నారు.

తఫ్సీర్ ఇక్బాల్ టిమ్ రీస్ సూపర్ :
తఫ్సీర్ ఇక్బాల్ పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో టీజీఎంఆర్ఈఐఎస్ దూసుకెళ్తోంది. తెలంగాణలో మైనార్టీ గురుకులాల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్ మెరుగుపడనుంది. ఇప్పుడు టిమ్ రీస్ పురోగతి శిఖరాలకు చేరుకుంది. విద్యార్థుల సంక్షేమం కోసం వినూత్న చర్యలు తీసుకున్నారు. ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీజీఎంఆర్ఈఐఎస్ లలో ఎప్పుడు, ఏం జరుగుతుందనేది వెంటనే తెలిసి పోతుంది. ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, పేరెంట్స్ కు ఏవైనా సమస్యలు ఎదురైతే టకీమనీ హెడ్ ఆఫీస్ కు చేరుతుంది. కంట్రోల్ రూమ్ పెట్టడంలో పరిపాలనా విధానాన్ని మెరుగుపరచడమే ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు చెబుతున్నారు. సంస్థలోని ఏ అంశానికి సంబంధించిన సమస్యలను ఎటువంటి సంకోచం లేకుండా నేరుగా ప్రధాన కార్యాలయానికి నివేదించవచ్చు. సమస్యలను పరిష్కరించడానికి మరియు తక్షణ పరిష్కారాలను కోరడానికి 24/7 కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది.

ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై వ్యక్తిగత పర్యవేక్షణ చేస్తున్నారు. పేలవమైన విద్యా పనితీరును ప్రదర్శించే విద్యార్థుల మెరుగుదల కోసం ప్రత్యేక తరగతులు కేటాయిస్తున్నారు. ప్రతి అంశంలోనూ పారదర్శకత నిర్వహించబడుతుంది. దృష్టికి తీసుకురాబడిన ఏదైనా సమస్యను సరైన విధానం ద్వారా విచారిస్తారు, దీని ద్వారా న్యాయం పాటిస్తారు. కార్యాలయ సిబ్బందిలో నిజాయితీని కాపాడుకోవడానికి మరియు ఏదైనా చట్టవిరుద్ధమైన మార్గాలను అనుసరిస్తే వాటిని నిరోధించడానికి ప్రధాన కార్యాలయంలో నిఘా కూడా జరుగుతుంది. విద్యార్థుల వినూత్న ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడంతోపాటు ఉన్నత చదువుల కోసం వారిని ప్రేరేపిస్తున్నారు. ఇందుకోసం ఫేస్‌బుక్ & ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక వెబ్‌సైట్ కూడా ఏర్పాటు చేశారు. క్రీడల పట్ల విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారు జాతీయ స్థాయిలో పాల్గొనడం జరుగుతుంది.

మెరిట్ విద్యార్థుల విజయాలు, వినూత్న ఆలోచనలను ప్రదర్శించే వెబ్‌సైట్‌లు బోర్డు పరీక్షలలో 100% ఫలితాల కోసం ఉపాధ్యాయులు, లెక్చరర్లకు మార్గదర్శకత్వం షానావాజ్ ఖాసిం ఐపీఎస్, ప్రభుత్వ కార్యదర్శి మైనారిటీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అలాగే ప్రతి అంశంలోనూ టీజీఎంఆర్ఈఐఎస్ రాణించడానికి మార్గదర్శకత్వం అందిస్తున్నారు. కార్యదర్శి టీజీఎంఆర్ఈఐఎస్ తఫ్సీర్ ఇక్బాల్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, వ్యక్తిగత సహాయకుడి ద్వారా సంస్థలలో పరిపాలనను సమీక్షించడంతోపాటు మెరుగుదల కోసం ముఖ్యమైన చర్యలను ప్రారంభించారు. టీజీఎంఆర్ఈఐఎస్ ను కార్యదర్శి స్వాధీనం చేసుకున్న తర్వాత, పోలీసు శాఖ ప్రతి విధానంలో పారదర్శకతను ప్రారంభించింది. ఎటువంటి చట్టవిరుద్ధ మార్గాలను వదలకుండా చూస్తున్నారు.

గతంలో టీమ్ రీస్ సెక్రటరీగా షానావాజ్ ఖాసీం పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం షానావాజ్ ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్నందున మైనార్టీ గురుకులాల డెవలప్ మెంట్ కు దోహదపడుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఇద్దరూ ఐపీఎస్ లు కలిసి ముస్లిం మైనార్టీ కేటగిరికి చెందిన పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నారు. కాగా మైనార్టీ గురుకులాల సెక్రటరీ తఫ్సీర్ ఇక్బాల్ సూపర్బ్ అని, ఈ ఐపీఎస్ ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తారీఫ్ చేస్తున్నారు.

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS