- ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- హరితసేలో భాగంగా మామ్మిడి మొక్కను నాటి దాసోజు
ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రావణ్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం నాడు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన ఛాంబర్‌లో దాసోజు శ్రావణ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా దాసోజుతో పాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారోత్సవానికి ముందు శ్రావణ్ గ్రీన్ ఛాలెంజ్ హరితసేవలో భాగంగా షేక్ పేట్‌లోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో కుటుంబ సమేతంగా మామిడి మొక్కను నాట్టారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు శుభప్రధంగా మొక్కను నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని అదే విధంగా వాటిని సంరక్షించాలని కోరారు. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం అవ్వడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన సంతోష్ కుమార్‌కు అయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, పద్మరావుగౌడ్, మాజీ మండలి చైర్మన్ మధుసూదన చారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మార బోయిన రవి యాదవ్, హరితసేన రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

18ఏళ్ళు రాజకీయ కార్యకర్తగా ఉన్నా,…
ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ గడిచిన పద్దెనిమిది యేండ్లు రాజకీయ కార్యకర్తగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చారని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా నాకు దక్కిన ఈ అవకాశాన్ని కేసీఆర్ మూడో సారి సీఎం అయ్యేందుకు వినియోగిస్తానని చెప్పారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనను అంతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. తన చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రయోజనాల కోసమే పని చేస్తానని, కేసీఆర్‌కు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా అంటూ చెపుకొచ్చారు. అలాగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.