- వర్షిణి కంటే పెళ్ళి పేరుతో మరోఅమ్మాయిని మోసం
- ఇంకా అనేక మంది బాధితులు వున్నారు
- నగ్న పూజల పేరుతో రూ.9.08లక్షల తీసుకుని మోసం
- మోకిలా పీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు
- మహిళా కమీషన్‌ను అశ్రయించిన వర్షిణి కుటుంబ సభ్యులు
- ఇప్పటికైన శ్రీనివాస్ అగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తారా ?
నేను అఘోరీని.. నిత్యం ఆ దేవుడి నామస్మరణలో వుంటాను.. నన్నే గుడిలోకి అనుమతించారా.. విజయవాడకు చెందిన అమ్మాయిని తీసుకెళ్ళి మరింత వివాదంలో చిక్కుకున్నాడు.. సోమవారం వర్షిణి అనే అమ్మాయితో వివాహం వీడియోలు.. బుధవారం నాడు నన్ను మోసం చేశారని పీఎస్‌లో మరో అమ్మాయి ఫిర్యాదు.. ఇలా పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిన ఆఘోరీ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆఘోరీ శ్రీనివాస్ వ్యవహరశైలీ వివాధస్పధంగా మారడంతో పాటు హాట్ టాపిక్‌గా మారింది. నిత్యం సోషల్ మీడియాల్లో అతని విడియోలు చక్కర్లు కొడుతునే వున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఆఘోరీ శ్రీనివాస్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతుంది. గత కొన్ని రోజులుగా తన వ్యవహార శైలితో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఆఘోరీ శ్రీనివాస్ ఇపుడు మరో రీతిలో హాట్ టాపిక్‌గా మారాడు. దేవాలయాల సందర్శన పేరుతో అతను చేసిన రచ్చ ఇంతా అంతా కాదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఏపీలో ఓ అమ్మాయిని తీసుకెళ్ళి వార్తల్లోకి ఎక్కిన శ్రీనివాస్ సోమవారం నాడు వివాహం చేసుకుని సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఓ యువతి ఆఘోరీ శ్రీనివాస్ తనను పెళ్ళి చేసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అఘోరీ శ్రీనివాస్ పై బుధవారం నాడు ఈమేరకు తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది.
హైదరాబాద్ రాణిగంజ్ బుద్ధ భవన్‌లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లిన కరీంనగర్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అఘోరి శ్రీనివాస్ తనను పెళ్లి పేరుతో వాడుకుని వదిలేశాడంటూ కమిషన్ ఎదుట భాదితురాలు వాపోయింది. తన జీవితాన్ని నాశనం చేశాడని, సోమవారం నాడు వర్షిణి అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది అమాయక మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అఘోరీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. పెళ్లైన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని అఘోరీ బెదిరిస్తున్నాడని వాపోయింది. తనలాంటి మహిళలు చాలా మందిని అతను మోసం చేశాడని అమె ఆరోపించింది. కావున అతని చేతిలో మోసపోయిన వారు అందరూ ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె కోరింది. తన వద్ద డబ్బులు తీసుకుని మానసికంగా హింసించాడని చెప్పింది. నగ్నపూజలు చేయిస్తానని చెప్పి నగదు తీసుకుని మోసం చేశాడని బాధితురాలు చెబుతోంది. కాగా రూ.9.08 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు. 308, 301, 351, 352 బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు, అన్నలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వర్షిణినీ అఘోరి శ్రీనివాస్ నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. అతని చెర నుంచి తమ కుమార్తెను ఎలాగైనా కాపాడి అప్పగించాలని బాధితులు కోరారు. కాగా, ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో అఘోరీ శ్రీనివాస్ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా అతని ఆగడాలను అరికట్టాలని పలువురు తెలుగు రాష్ట్రాల ప్రజలు రెండు ప్రభుత్వాలను కోరుతున్నారు.