- గతంలో ధరణిలో అనేక మోసాలు
- లోపాలు సరిదిద్ది పారదర్శక చట్టం తెచ్చాం
- భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి
ధరణి చట్టం ద్వారా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతులకు భద్రత కల్పిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూములున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పొంగులేటి అన్నారు. ధరణిలో తమ భూమి నమోదు కాలేదని భారాస నేతలే చెబుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్‌లో ’భూభారతి’పై ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణి లోపాలను సరిదిద్దాలని మాజీ మంత్రులు కోరుతున్నారు. వివరాలు తప్పుగా నమోదయ్యాయని చెబుతున్నారు. భూభారతి బిల్లు అసెంబ్లీలో పెడితే మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేదలకు అండగా ఉండేందుకు ఈ చట్టం తీసుకువచ్చాం. భూ భారతి చట్టం దేశంలోనే రోల్‌మోడల్ కాబోతోంది. ధరణి అమలులో ఉన్నప్పుడు అధికారుల వద్దకే ప్రజలు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారు. ఒక్క రూపాయి లేకుండా దరఖాస్తు చేసే అవకాశం వచ్చింది. పేదలకు చెందిన వేల ఎకరాలను గత ప్రభుత్వం కొల్లగొట్టింది. గతంలో కొల్లగొట్టిన భూములపై ఆడిట్ చేసి పేదలకు పంచుతాం. అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హులైన పేదలకు ఇస్తాం. కోర్టులో లేని భూముల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తాం. గతంలో పాసు పుస్తకం ప్రకారం కాకుండా భూమి ఎక్కువో.. తక్కువో ఉండేదని పొంగులేటి అన్నారు.
అయితే నాటి ధరణికి, నేటి భూభారతికి పోలికే లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పథకాల అమలును ప్రతిపక్షాలు ఓర్వడం లేదన్నారు. ధరణిలో సమస్యలున్నాయి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే చెప్పారన్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని బీఆర్‌ఎస్ లక్షలాది ఎకరాలు కొల్లగొట్టిందని ఆరోపించారు. భూ భారతితో సమస్యలు తీరుస్తామన్నారు పొంగులేటి శ్రీనివాస్. ఒక్క పైసా చెల్లించకుండానే భూ సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. అధికారులే ప్రజల దగ్గరకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. పేదల కష్టాలు తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుల భూ సమస్యలను తెలుసుకోవడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో నాలుగు మండలాలు పైలట్ ఎంపిక చేసాం. మద్దూరు నేలకొండపల్లి ములుగు కామారెడ్డి జిల్లా కలెక్టర్లు అన్నీ మండల పర్యటించి భూభారతిపై అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. మే 1 నుంచి ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని రాష్ట్రవ్యాప్తంగా మిగతా 28 జిల్లాలో పైలట్ మండలాలుగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారు. జూన్ 2న నాలుగు పైలెట్ మండలాల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు. మోడల్ మండలాల మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోకి రెవెన్యూ అధికారులు సందర్శిస్తారని అన్నారు. స్థానిక నాయకులు, అధికారులు కార్యమ్రంలో పాల్గొన్నారు.