Saturday, April 19, 2025
spot_img

లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Must Read

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం నుంచీ ఏకబిగిన పెరుగుతూ పోయాయి. ఉదయం సెన్సెక్స్‌, నిప్టీ, సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నా.. తర్వాత నుంచి భారీగా పరుగులు పెట్టాయి. ఒక దశలో నిప్టీ 23,861 పాయింట్ల దగ్గర గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్‌ 78,566 పాయింట్ల గరిష్టానికి వెళ్లింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 1508.91 పాయింట్లు (1.96 శాతం) లాభంతో.. 78,553.20 వద్ద, నిప్టీ 414.45 పాయింట్ల (1.77శాతం) లాభంతో.. 23,851.65 పాయింట్ల వద్ద నిలిచాయి. బ్యాంక్‌ నిప్టీ 1,172.45 పాయింట్లు- పెరిగింది. ఆటో, ఫార్మా, ఫైనాన్షియల్‌ కంపెనీ స్టాక్స్‌ భారీ ర్యాలీ తీశాయి. దాదాపు 2340 షేర్లు ఇవాళ పుంజుకోవడం విశేషం. 1468 షేర్లు క్షీణించాయి. 149 షేర్ల విలువలో ఎలాంటి మార్పు లేకుండా స్తబ్దుగా ఉన్నాయి. టెలికాం, బ్యాంక్‌, ఆయిల్‌ గ్యాస్‌, ఫార్మా, ఆటో, ఎనర్జీ, ప్రైవేట్‌ బ్యాంక్‌ 1-2 శాతం పెరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ ఒక్కొక్కటి 0.5 శాతం పెరిగాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, ఎటర్నల్‌ నిప్టీలో ప్రధానంగా లాభాలను ఆర్జించగా, విప్రో, హీరో మోటోకార్ప్‌, -టె-క్‌ మహీంద్రా, కోల్‌ ఇండియా ఇంకా స్టీల్‌ నష్టపోయాయి.

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS