Saturday, April 19, 2025
spot_img

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు అవార్డ్

Must Read

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్‌ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్ బిజినెస్ & సోషల్ ఫోరమ్ కార్యక్రమంలో, సంస్థకు ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్స్ & లీడర్స్ 2024–25 అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మునగాల మోహన్ శ్యాం ప్రసాద్ స్వీకరించారు. ఈ సందర్భంగా మునగాల మోహన్ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ గౌరవం తెనాలి డబుల్ హార్స్ కుటుంబానికి మాత్రమే కాక, మాతో కలిసిన ప్రతి వినియోగదారుడు, డిస్ట్రిబ్యూటర్, భాగస్వామి నమ్మకానికి అద్దంపడుతోంద‌న్నారు. “ఈ గుర్తింపు మా ప్రయాణంలోని ఓ మైలురాయి. ఇది తెనాలి అనే చిన్న పట్టణం నుండి ప్రపంచ స్థాయిలో విశ్వసనీయత సంపాదించిన మా ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ గౌరవాన్ని మా బృందం, రైతులు, వ్యాపార భాగస్వాములు మరియు మా మీద నమ్మకాన్ని ఉంచిన ప్రతి వినియోగదారుడికి అంకితం చేస్తున్నాము. మేడ్ ఇన్ తెనాలి, మేడ్ ఫర్ ది వరల్డ్” అన్న సిద్ధాంతంతో మా ప్రయాణం కొనసాగుతుంది. “ అని మోహన్ శ్యాం ప్రసాద్ అన్నారు.

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS