కేటీఆర్ ప్రధాని ట్విట్‌కు చామల కౌంటర్
హెచ్‌సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు ఎక్స్ వేధికగా ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్ అయన చురకలు అంటించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్‌కు ధన్యావాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మొదటగా అయన ఐటీ పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్నందుకు, తెలంగాణ యువతకు ఉపాధి, ఉద్యోగాలను రాకుండా అడ్డుకున్నందుకు, తాను క్రియేట్ చేయించిన ఏఐ ఫేక్ వీడియోలను విస్త్రుత ప్రచారం చేసి ప్రజలను నమ్మించినందుకు కేటీఆర్‌కు ధన్యావాధాలు అంటూ పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు నిధులు రాకుండా అడ్డుకున్నందుకు, నిధులు పుష్కలంగా వస్తే ప్రజా సంక్షేమాన్ని ఇనుమడించితే, రేవంత్ సర్కారుకు మంచి పేరు వస్తుందిని, అది రాకుండా అడ్డుకున్నందుకు, మొత్తంమీద తెలంగాణలో రేవంత్ సర్కారు కాళ్లల్లో కట్టె పెట్టడంలో తమతో కలిసి వచ్చినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు అంటూ చామల తనదైన శైలీలో కేటీఆర్ పై విమర్శలు చేశారు.