- దాహార్తి తీర్చుకునేందుకు రోడ్లపైకి వచ్చి మృత్యువాత పడుతున్న వైనం
- కుక్కల దాడిలో వరుస జింకల మరణాలు..!
- వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో దురదృష్టకర పరిస్థితులు
వికారాబాద్ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతంలో జంతువుల తాగునీటి సమస్యకు అటవీ శాఖాధికారులు శాశ్వత పరిష్కారం కొరకు సార్ ప్లేట్లను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం వేసవికాలంలో అడవి జంతువుల దాహం తీర్చేందుకు పలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఎండలు మండిపోవడంతో అడవి జంతువులు రోడ్లపైకి వచ్చి ప్రమాద ప్రమాద బారిన పడుతున్నాయి. ఈ మధ్యకాలంలో కుక్కల వేట లో పదుల సంఖ్యలో అడవి జంతువులు మృత్యువాత పడ్డాయి కానీ అడవి శాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏటా వేసవి ప్రారంభం నుంచి జంతువులకు తాగునీటి సమస్య ఏర్పడేది. అధికారులు ట్యాంకర్ల ద్వార కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ తొట్లు(సాసర్ ప్లేట్లను)ను ఏర్పాటు చేసినప్పటికీ వేసవి తీవ్రతకు నీరు ఆవిరి కావటం, కొన్ని ప్రాంతాల్లో ట్రాక్టర్ ద్వార నీళ్లు పోయకపోవటంతో జంతువులు దాహంతో అల్లాడుతున్నయి.అడవి జంతువుల దాహం తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి వన్య ప్రాణులను సంరక్షించాలని కోరుతున్నారు.